- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగేళ్ల కొడుకును అంతర్జాతీయ మీటింగ్‌లకు తీసుకెళ్తున్న మస్క్.. కానీ ఎందుకు?
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్‌కు పదకొండు మంది పిల్లలు. కానీ వీరందరిలో నాలుగేళ్ల పిల్లాడు X Ã A-Xii అంటే చాలా ఇష్టం ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా అతన్ని వెంట పెట్టుకునే వెళ్తున్నాడు.

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్‌కు పదకొండు మంది పిల్లలు. కానీ వీరందరిలో నాలుగేళ్ల పిల్లాడు X Ã A-Xii అంటే చాలా ఇష్టం ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా అతన్ని వెంట పెట్టుకునే వెళ్తున్నాడు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యోమగాములు, ప్రధాన మంత్రులు, అధ్యక్షులతో సమావేశానికి Xని తీసుకెళ్లడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. మరి దీనిపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయో చూద్దాం.
ఎలోన్ మస్క్ మాజీ భార్య గ్రిమ్స్ ఒక సింగర్. ఆమె డ్యూన్ (2021) సినిమా చూసినప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయిందట. భూగోళాన్ని పరిపాలించి కాపాడాల్సిన బాధ్యత ఉన్న పాలకుడి కుమారుడు పాల్ అట్రీడ్స్ పాత్రలో తమ కొడుకు Xను ఊహించుకుని ఎమోషనల్ అయిపోయిందట. ఈ ఇన్సిడెంట్ మస్క్ X ని తన శిష్యుడిగా, సహచరుడిగా, ప్రతిచోటా తనకు తోడుండే వ్యక్తిగా ఎంచుకునేందుకు కారణం కావచ్చు. అందుకే నాలుగేళ్ల X తన తండ్రితో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంపార్టెంట్ మీటింగ్స్‌కు అటెండ్ అవుతున్నాడు. అతని ఒడిలో కూర్చుని ప్రీమియర్‌లకు హాజరవుతూ, కాన్ఫరెన్స్ టేబుళ్లపై డ్యాన్స్ చేయడం కూడా చూడొచ్చు.
* అనేక మందితో డేటింగ్, పెళ్లిళ్లు, విడాకులు తీసుకున్న మస్క్.. కనీసం ఏడాది కూడా ఎవరితో సరిగ్గా ఉండలేకపోయాడనే ప్రచారం జరుగుతుంది. జీవితంలో అన్నీ కలిగి ఉన్నట్లు కనిపించాలని కోరుకునే మస్క్.. ఒక్క మాటలో చెప్పాలంటే మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకోవాలని కోరుకునే అతను.. మంచి తండ్రిగా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడేమో.
* మస్క్ జీవిత చరిత్ర రచయిత వాల్టర్ ఐజాక్సన్.. X పుట్టిన క్షణం నుండి తనకు ప్రత్యేకమని మస్క్ గుర్తించాడని రాశాడు. X మస్క్‌ను శాంతిని, సంతోషాన్ని అందిస్తాడని అనుకున్నాడు. అందుకే ట్విట్టర్‌కు X అని.. అంతరిక్ష వెంచర్‌కు స్పేస్‌ఎక్స్ అని పేరు పెట్టాడు.
* ఇక మస్క్ దుర్వినియోగ కుటుంబం నుంచి రావడం అనేది ఇందుకు కారణం కావచ్చు. ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదనే ఆలోచన .. తన కొడుకు పట్ల ఇంత ప్రేమ పుట్టేందుకు కారణం కావచ్చు.
* బిలియనీర్ అయిన మస్క్ దాదాపు ప్రతి సమావేశానికి X ని తీసుకెళ్లడం మంచి వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవడానికి చేసే ప్రయత్నాలలో భాగమని కొందరు భావిస్తున్నారు. మస్క్ తన ఆల్ఫా-మేల్ ఇమేజ్‌ను తగ్గించుకునేందుకు Xని ఉపయోగించుకుంటున్నాడని.. తద్వారా అందరికీ ఆమోదయోగ్యుడిగా మారవచ్చని అంటున్నారు.
* నిజానికి స్పేస్‌ఎక్స్, టెస్లా, X వంటి కంపెనీలతో టెక్నాలజీతోపాటు రాజకీయ రంగంలో కూడా మస్క్ విజయం సాధించాడు. డొనాల్డ్ ట్రంప్‌ను వైట్‌హౌస్‌కు ఎన్నికయ్యేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అతని ఇమేజ్‌ను పూర్తి చేయడానికి మిగిలి ఉన్నది ప్రేమగల తండ్రి. ఎలాగూ మంచి భర్తగా, మంచి భాగస్వామిగా స్థిరత్వం లేనందునా అతన్ని కుటుంబ వ్యక్తిగా చూడలేము. కాబట్టి శ్రద్ధగల తండ్రిగా భావించేలా చేయడమే ఇప్పుడున్న పని. కొడుకు ఎప్పుడూ తన పక్కన ఉంటే ఆ ఇమేజ్ పూర్తవుతుంది. మస్క్ కుటుంబ జీవితాన్ని బహిరంగంగా ప్రదర్శించడం.. మస్క్, ట్రంప్ ఇద్దరికీ ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇతర విషయాలపై దృష్టిని మళ్లించేందుకు ఇదో వ్యూహం అని కూడా అంటున్నారు.
* అమెరికా అధ్యక్షుడు 4 ఏళ్ల పిల్లవాడిని "హై ఐక్యూ వ్యక్తి" అని పిలిచినప్పటికీ.. మస్క్ మాత్రం తన "ఎమోషనల్ సపోర్ట్ హ్యూమన్" అని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో ప్రదర్శించడానికి వెనుకాడలేదు. Xతో పోలికతో సహా తన కొడుకు పట్ల స్పెషల్ అటెన్షన్‌కు సంబంధించిన ఈవెంట్‌ల ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేశాడు.






