Mosquito: దోమలు పగలు ఎందుకు కనపడవు.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే!

by Phanindra |

దోమలు ( Mosquito ) చూడటానికి చిన్నగా ఉంటాయి.

Mosquito: దోమలు పగలు ఎందుకు కనపడవు.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్ : దోమలు ( Mosquito ) చూడటానికి చిన్నగా ఉంటాయి. కొందరైతే ఇవి ఏం చేస్తాయిలే అనుకుని పట్టించుకోకుండా ఉంటారు. ఇవి ఒక్కసారి దాడి చేస్తే ఆరోగ్యంగా ఉండే మనిషిని కూడా హాస్పిటల్ బెడ్ పై పడేలా చేస్తాయి. వరల్డ్ వైడ్ గా దోమ కాటు వలన 12 కి పైగా వ్యాధులు వస్తున్నాయి. వీటిలో డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధులు కూడా ఉన్నాయి. అలాగే, ఇవి పగటిపూట ఎక్కువగా కనబడవు. రాత్రి సమయాల్లోనే కనిపిస్తుంటాయి. అయితే దీని వెనుక ఉన్న కారణమేంటో ఇక్కడ తెలుసుకుందాం..

దోమలు రాత్రిపూట ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతాయని పరిశోధనల్లో తేలింది. పగటి వెలుగును దోమలు ఇష్టపడవట. అలాగే, రాత్రి సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.. ఇది దోమలకు అనుకూలంగా ఉంటుంది. దీంతో, దోమలు చీకటిలో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతాయి. దోమలు మన శరీర ఉష్ణోగ్రతకి అట్ట్రాక్ట్ అవుతాయి. మనం నిద్రించే సమయంలో స్థిరంగా ఉంటాము కాబట్టి అవి మన మీద దాడి చేస్తాయి.

అన్ని రకాల దోమలు ఒకేలా కుట్టవు. డెంగీ ( dengue ) దోమలు పగలు కుడతాయి. మిగతా దోమలు ఉదయం కుట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఆ సమయంలో దగ్గరికి కూడా రావు. వాతావరణం మారినప్పుడు దోమల ప్రవర్తన కూడా మారుతుంది. దోమలపై ఎన్నో పరిశోధనలు చేశారు. ఇక, వ్యాధులు వ్యాప్తి చేసే దోమల విషయానికి వస్తే.. ఏడిస్ దోమలు ఎక్కువగా కుడతాయని తెలిపారు. డెంగ్యూ, యెల్లో ఫీవర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు ఈ దోమ ద్వారా వ్యాపిస్తాయి. జికా వైరస్ వ్యాప్తి చెందడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇవి ఎక్కువగా కొలనులు, చెరువులు, వాగులు , నీరు ఉన్న పాత్రలలో లోపల కనిపిస్తాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story