పీరియడ్స్‌లో నలుపు రక్తం.. ప్రమాదానికి సంకేతం!!

by Chukka Sudharani |   (  Updated:2022-10-28 09:56:24  IST  )

మహిళల్లో పీరియడ్ బ్లడ్ సాధారణంగా ఎరుపురంగులోనే ఉంటుంది. కానీ కొన్నిసార్లు నల్లగా మారుతుంది.

పీరియడ్స్‌లో నలుపు రక్తం.. ప్రమాదానికి సంకేతం!!
X

దిశ, ఫీచర్స్: మహిళల్లో పీరియడ్ బ్లడ్ సాధారణంగా ఎరుపురంగులోనే ఉంటుంది. కానీ కొన్నిసార్లు నల్లగా మారుతుంది. ఇది ఆందోళన కలిగించే విషయమేనంటున్న నిపుణులు.. ఇలాంటప్పుడు వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఎలాంటి సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందో వివరిస్తున్నారు.

* యోనిలో టాంపోన్‌ని మరచిపోయి ఉండవచ్చు:

ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు కానీ యోనిలో టాంపోన్‌ను మరచిపోయే స్త్రీలు కూడా ఉన్నారు. టాంపోన్ యొక్క పరిమాణం చాలా చిన్నది మరియు దాని ఉనికిని అనుభవించనందున.. కొన్నిసార్లు దాని గురించి మరచిపోవచ్చు. దీనివల్ల యోనిలో బ్యాక్టీరియా వృద్ధి చెంది, యోని ఇన్ఫెక్షన్‌లకు దారితీస్తుంది. తద్వారా బ్లాక్ పీరియడ్ బ్లడ్‌కు దారి తీస్తుంది.

* మిస్‌క్యారేజ్ సిగ్నల్ కావచ్చు:

దురదృష్టవశాత్తు ఇది నిజం. మీ కడుపులో పిండం ఎదుగుదల ఆగిపోయినప్పుడు, అది మీ శరీరం నుండి బయటకు రానప్పుడు నల్ల మచ్చలు కనిపించవచ్చు. అటువంటి సందర్భాలు చాలా వరకు గర్భస్రావంతో ముగుస్తాయి. గర్భస్రావం లక్షణాల్లో బ్లాక్ పీరియడ్ బ్లడ్ చాలా ముఖ్యమైనది.

* ప్రసవానంతర రక్తస్రావం:

బిడ్డకు జన్మనిచ్చాక బ్లాక్ బ్లడ్ డిశ్చార్జ్ కావచ్చు. దీనిని లోచియా అంటారు. ఇది చాలా సాధారణమైనది. లోచియా బ్రైట్ కలర్ బ్లడ్‌తో ప్రారంభమై.. తర్వాత నలుపు లేదా ముదురు రంగులోకి మారుతుంది. ఈ పరిస్థితిలో వ్యవధి వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు.

* ఋతుక్రమం నిలుపుకోవడం:

'హెమటోకోల్పోస్' అనే పదం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మీ పీరియడ్స్ రక్తం చాలా కాలం పాటు డిశ్చార్జ్ కాకపోవడం దీని అర్థం. ఇలాంటి సిచ్యువేషన్‌లో మీ హైమెన్, సెర్విక్స్ లేదా యోనిలో ఒక రకమైన అడ్డంకి ఉందని కూడా సూచించబడుతుంది. దురదృష్టవశాత్తు తీవ్రమైన సందర్భాల్లో ఇది 'అమెనోరియా'గా కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు తరచుగా నల్ల మచ్చలు కనిపిస్తే తప్పనిసరిగా సహాయం తీసుకోవాలి.

Next Story