- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral News: నైటీలో ఉన్న భార్య.. ఆ పార్ట్ కొరికేసిన భర్త! రాష్ట్రమంతా రచ్చ రచ్చ
Viral News:అమ్మాయి బుగ్గలు బూరెల్లా ఉన్నాయి అంటే నిజంగా బూరెలు అనుకొని ఎవరైనా కొరికేస్తే

దిశ, వెబ్ డెస్క్: Viral News: అమ్మాయి బుగ్గలు బూరెల్లా ఉన్నాయి అంటే నిజంగా బూరెలు అనుకొని ఎవరైనా కొరికేస్తే... ఆ ప్రబుద్ధిడిని ఏమనాలి.. సరిగ్గా అలాంటి సంఘటనే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లా శాంతీపుర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బాధితురాలు మధు ఖాతూన్ ముక్కు అందంగా ఉందని, ఆమె భర్త నోటితో కొరికేయడంతో పళ్ళ గాయాలు గట్టిగా లోపలికి దిగి ఆసుపత్రి పాలయ్యింది.
అవును.. మీరు వింటున్నది నిజమే. గతంలో ఆమె ముక్కు అందంగా ఉందని వర్ణించేవాడని అవకాశం వస్తే కొరికి తినేస్తానని ఆమె భర్త తరచూ తనతో చెప్పేవాడని చెప్పుకొచ్చింది. ఏదో మాట వరసకు అంటున్నాడు కదా అని బాధితురాలు సిగ్గుమొగ్గలైంది. కానీ తన భర్త పైశాచిక ఆనందం ఆమె ముక్కుని కొరికి గాయం చేసినప్పుడు బయటపడింది. నోటితో ముక్కును గాయం చేయడంతో లబోదిబో అన్న భార్య నేరుగా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొంది అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
ఈ ఘటన చూసిన పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. వీడు మరీ ఇంత వైల్డ్ గా ఉన్నాడు ఏంట్రా అని ఆ పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. బాధితురాలు తన భర్త చేసిన పనిని మీడియా ముందు సైతం వెళ్లగక్కి తన బాధను బయట పెట్టుకుంది. ఇదిలా ఉంటే భార్యను తీవ్రంగా గాయపరిచిన అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతని పైన గృహహింస సెక్షన్స్‌తో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాధితురాలు ముక్కుకి కట్టు కట్టుకొని వెళుతున్న దృశ్యం ప్రస్తుతం వైరల్ గా మారింది.






