- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెల్లజుట్టు మంచిదే.. క్యాన్సర్ ను అడ్డుకుంటుంది
ఒకటీ రెండు తెల్ల వెంట్రుకలు వస్తేనే బెంబేలెత్తి పోతారు. జుట్టు తెల్లబడుతున్న కొద్దీ దాన్ని కవర్ చేస్తూ నానా తిప్పలు పడుతుంటారు.

దిశ, వెబ్ డెస్క్ : ఒకటీ రెండు తెల్ల వెంట్రుకలు వస్తేనే బెంబేలెత్తి పోతారు. జుట్టు తెల్లబడుతున్న కొద్దీ దాన్ని కవర్ చేస్తూ నానా తిప్పలు పడుతుంటారు. ఇక తెల్లజుట్టు నల్లగా మారుస్తామని చెప్పే ప్రోడక్ట్స్ మార్కెట్లో కోకొల్లలు. తెల్లజుట్టుతో ఇన్సెక్యూర్ గా ఫీలవడం, ఏజ్ పెరిగిపోయింది అని బాధ పడేవాళ్ళకు లెక్కేలేదు. అయితే జుట్టు తెల్లబడటం మంచిదేనని చెబుతున్నారు జపాన్ పరిశోధకులు. శరీరంలో క్యాన్సర్ కు కారణం అయ్యే కణాలను నాశనం చేసే ప్రాసెస్ జుట్టు రంగు కోల్పోతుందని, అది కూడా ఒక రకంగా మంచిదేనని చెబుతున్నారు.
అయితే మన దేహంలో మెలనోసైట్స్ కారణంగా జుట్టు నల్లగా ఉంటుందని, ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పడే కణాలు జుట్టుకు నలుపు రంగును అందిస్తాయట. శరీరంలో క్యాన్సర్ గా మారే కణాలను అంతం చేయడానికి ఈ మెలనోసైట్స్ రక్షక కణాలుగా అడ్డుకునే క్రమంలో తమను తాము చంపుకుంటాయట. అందుకే జుట్టుకు నలుపు రంగు అందక తెలుపు రంగులోకి మారతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో.. ఇకపై జుట్టు రంగు మారుతుందని బాధ పడే పనిలేదన్నమాట.






