- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మితిమీరిన సరదా.. నాగుపామును ఆడిస్తూ వీడియో
by Mallepaka Hamsa |
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం జనాలకు ఏదైనా కొత్త పని చేసినా, చూసినా సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం సరదాగా మారింది..Latest Telugu News

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం జనాలకు ఏదైనా కొత్త పని చేసినా, చూసినా సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం సరదాగా మారింది. అయితే, కొన్నిసార్లు ఈ తరహా ఘటనలు వివాదాస్పదాలు, విషాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా.. అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్ పూర్‌కు చెందిన దేవేంద్ర శర్మ పొరుగింట్లోకి నాగుపాము వచ్చింది. అయితే, దాన్ని కర్రతో అతను పట్టుకొని జనావాసాలకు దూరంగా వదిలిపెట్టకుండా ఒక రెండు గంటల పాటు ఆడిస్తూ ఊరంతా తీరిగాడు. ఓ చిన్నారి మెడలో దాన్ని వేసి వీడియో తీస్తుండగా ఒక్కసారిగా కాటు వేసింది. అతను వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా మూలికలు తినడంతో దేవేంద్ర శర్మ మరణించాడు.
Next Story






