- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Misophonia : చిన్న చిన్న శబ్దాలు కూడా భరించలేరు..! ఇది వ్యాధి లక్షణమా?
ఆస్ట్రేలియాలోని న్యూకాసిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం మిసోఫోనియా ఉన్నవారిలో శబ్దాలు మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ను ప్రభావితం చేస్తాయి

దిశ, ఫీచర్స్ : శబ్ద కాలుష్యం ప్రమాదకరం. కానీ రోజువారీ జీవితంలో వినబడే సాధారణ శబ్దాలవల్ల ఎటువంటి ప్రమాదమూ ఉండదు. అయినప్పటికీ కొందరు చిన్న చిన్న శబ్దాలను కూడా భరించలేరు. ఉదాహరణకు గోడ గడియారం నుంచి వచ్చే టిక్ టిక్ శబ్దం, ఇతరులు ఆహారం నమలేటప్పుడు, పానీయాలు తాగుతున్నప్పుడు, శ్వాస తీసుకుంటున్నప్పుడు వచ్చే చిన్న చిన్న శబ్దాలు కూడా భరించలేరు. పైగా ఈ సౌండ్స్ వింటేనే కోపం, అసహ్యం, అసౌకర్యం వంటివి కలుగుతాయి. ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే అది మిసోఫోనియా అనే మానసిక స్థితి(mental condition)కావచ్చు అంటున్నారు సైకాలజిస్టులు. దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదు కానీ, ఇదొక చిన్నపాటి రుగ్మతగా పేర్కొంటున్నారు. దీనివల్ల ప్రతికూల, సానుకూలతలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దాం.
న్యూకాసిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం మిసోఫోనియా ఉన్నవారిలో శబ్దాలు మెదడులోని ఇన్సులా(స్పృహతో కూడిన అవగాహనను సృష్టించే భాగం), అలాగే ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ల మధ్య అసాధారణ కనెక్షన్‌లను కలిగిస్తాయని కనుగొన్నారు. అయితే సాధారణ శబ్దాలను సైతం అసౌకర్యంగా, అసహ్యంగా భావించడంతో బాధిత వ్యక్తుల రోజువారీ జీవితంలో అసాధారణ భావోద్వేగ ప్రతిస్పందనలకు దారితీస్తుంది. ముఖ్యంగా కోపం, అసహ్యం, ఒత్తిడి, భయం వంటివి క్రమంగా పెరగవచ్చు. కాబట్టి మిసోఫోనియా లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలంటున్నారు మానసిక నిపుణులు. అయితే ఇది పూర్తిస్థాయి మానసిక రోగం మాత్రం కాదు. కానీ, ఒక న్యూరోలాజికల్ లేదా సైకలాజికల్ స్థితిగా నిపుణులు పరిగణిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఒబ్సెసివ్-కంపల్సివ్ డిసార్డర్ (OCD) లేదా యాంగ్జైటీ డిసార్డర్‌గా మారవచ్చు. ఎందుకంటే మిసోఫోనియా ఉన్న వ్యక్తులు శబ్దాల పట్ల అతి సున్నితత్వం కలిగి ఉంటారు. అయితే దీనిసానుకూలత విషయానికి వస్తే కొందరిలో ఇది వారి సృజనాత్మకత లేదా తెలివితేటలకు సంబంధించిన లక్షణం కూడా కావచ్చు. కానీ మరీ అధికమైతే సమస్యలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. Link






