Weightlifting: మహిళలు బరువులు ఎత్తడం ఎప్పుడు ప్రారంభించాలి?

by Kodari Anjali |

మహిళలు బరువులు ఎత్తడం ఎప్పుడు ప్రారంభించాలని తాజాగా నిపుణులు వెల్లడించారు.

Weightlifting: మహిళలు బరువులు ఎత్తడం ఎప్పుడు ప్రారంభించాలి?
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళలు బరువులు ఎత్తడం ఎప్పుడు ప్రారంభించాలని తాజాగా నిపుణులు వెల్లడించారు. వాస్తవానికి మహిళలు వెయిట్ లిఫ్టింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదని గుర్తించారు. కానీ పలు కారణాల వల్ల చాలా కాలంగా మహిళలు బరువులు ఎత్తకుండా నిరుత్సాహపడుతున్నారని అంటున్నారు. కానీ పరిస్థితులు మారుతున్నాయని మెడిసిన్ MD డాక్టర్ యోకేష్ అరుల్ పేర్కొన్నారు. కాగా మహిళలు బరువులు ఎత్తడం ఎంత త్వరగా ప్రారంభిస్తే అది మీ ఆరోగ్యానికి అంత మంచిదని డాక్టర్ అరుల్ అన్నారు.

బరువులు ఎత్తడం వల్ల కలిగే ప్రయోజనాలు

మహిళలు వెయిట్ లిఫ్టింగ్ చేస్తే.. మధుమేహం, రక్తపోటు, ఆస్టియోపోరోసిస్ వంటి దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపారు. వెయిట్ లిఫ్టింగ్ ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెయిట్ లిఫ్టింగ్ సమయంలో ఎముకలపై ఉంచే యాంత్రిక ఒత్తిడి ఎముక పునర్నిర్మాణం అలాగే పెరుగుదలను ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ఇది బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలకు దారితీస్తుంది" అని డాక్టర్ అరుల్ అన్నారు.

సరైన పోషకాహారం తీసుకోవడంతో పాటు వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల మహిళలు శరీర కొవ్వును తగ్గించుకుని, సన్నగా ఉండే శరీరాన్ని పొందవచ్చని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతోన్న మహిళలకు పీరియడ్స్ రెగ్యులర్‌గా రావట్లేదు. కాగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తే ప్రతి నెల పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయని చెబుతున్నారు.

బరువులు ఎత్తడానికి ఉత్తమ సమయం

డాక్టర్ అరుల్ ప్రకారం.. మహిళలు బరువులు ఎత్తడానికి అనువైన సమయం వ్యక్తిగత ప్రాధాన్యతలు, శక్తి స్థాయిలు, హార్మోన్ల హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది. ఉదయం వ్యాయామాలు చేస్తే స్థిరత్వం అలాగే రోజంతా జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే సాయంత్రం చేస్తే మేలని సూచిస్తున్నారు. ఈవెనింగ్ సమయంలో బలం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.

పీరియడ్స్ సమయంలో వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన జాగ్రత్తలు

ఋతుస్రావం సమయంలో బరువులు ఎత్తడం సాధారణంగా సురక్షితం. కానీ బాగా టైడ్ అయినట్లు అనిపిస్తే కనుక, తిమ్మిర్లు వంటివి వస్తే వెంటనే ఆపేయడం బెటర్. ముఖ్యంగా తిమ్మిర్లు వస్తే వ్యాయామం చేయడం మానుకోండి. హెవీ స్క్వాట్స్ లేదా డెడ్‌లిఫ్ట్‌ల వంటి కదలికలు అసౌకర్యాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి.

అలాగే వెయిట్ లిఫ్టింగ్ సమయంలో సౌకర్యవంతమైన బట్టలు వేసుకోండి. శ్వాస అందే బట్టలు ధరిస్తే మేలు. ఆడవాళ్లు 60 ఏళ్లలో వెయిట్ లిఫ్టింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదేనని అధ్యయనం కనుగొంది. కానీ వ్యాయామం తర్వాత యోగా చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story