- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాట్సాప్‌లో ‘గెస్ట్ చాట్స్’.. బీటా టెస్టింగ్‌లో కొత్త ఫీచర్!
వాట్సాప్ యూజర్లు ఈ యాప్‌లేని ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ‘గెస్ట్ చాట్స్’ ఫీచర్‌లోని ఒక లింక్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది ‘గెస్ట్’గా తాత్కాలిక చాట్‌లో జాయిన్ కావచ్చు!

దిశ, ఫీచర్స్ : వాట్సాప్ ద్వారా మరో వ్యక్తితో చాట్ చేయాలంటే.. అవతలి వ్యక్తి ఫోన్‌లో కూడా వాట్సాప్ ఉండాల్సిందే. అంటే వాట్సాప్ ఖాతాలేని వ్యక్తులతో చాటింగ్ చేయడం కుదరదు. కానీ ఇక నుంచి అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే వాట్సాప్ ఇప్పుడు ‘గెస్ట్ చాట్స్’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఇది టెస్టింగ్‌లో ఉంది. WABetaInfo ప్రకారం.. బీటా వెర్షన్‌లో ఉన్న కొంతమంది యూజర్ల(Android, iOS )కు ఇది రోల్ అవుతోంది. వినియోగదారులు ఒక సెక్యూర్ ఇన్వైట్ లింక్‌ను జనరేట్ చేసి, ఎస్‌ఎంస్, ఈమెయిల్ లేదా ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా ఇక వాట్సాప్ చాటింగ్‌లను షేర్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇది పూర్తిగా అందరికీ అందుబాటులోకి వస్తే యూజర్లు తమ వాట్సాప్ ద్వారా వాట్సాప్ లేనివారితో అంటే టెలిగ్రామ్, ఇతర చాటింగ్ యాప్‌లకు వాట్సాప్ ద్వారానే మెసేజెస్ పంపవచ్చు. చాటింగ్ చేయవచ్చు.
వాట్సాప్ యూజర్లు ఈ యాప్‌లేని ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ‘గెస్ట్ చాట్స్’ ఫీచర్‌లోని ఒక లింక్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీంతో అవతలి వ్యక్తికి వాట్సాప్ లేకపోయినా ఇతర ఏ మెసేజింగ్ యాప్ కలిగి ఉన్నా వాట్సాప్ యూజర్‌తో బ్రౌజర్ ద్వారా ‘గెస్ట్’గా తాత్కాలిక చాట్‌లో జాయిన్ అవుతారు. ఇక్కడ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లు మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీడియా షేరింగ్, కాల్స్, గ్రూప్ చాట్స్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అందుబాటులో ఉండవు. ఇక ఈ చాట్ 10 రోజులు ఇనాక్టివ్‌గా ఉంటే ఆటోమాటిక్‌గా ఎక్స్‌పైర్ అవుతుంది. మరో విషయం ఏంటంటే.. గెస్ట్ చాట్‌ను గెస్ట్ ఫీచర్ మాత్రమే స్టార్ట్ చేయగలదు. ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్లు (ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా) నాన్-యూజర్లతో సులభంగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. దీనివల్ల Telegram లేదా Signal వంటి ఇతర యాప్‌లకు మారాల్సిన అవసరం తగ్గుతుందని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఇది ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి రావచ్చు.






