Constipation : రాత్రి పూట ఇలా చేస్తే.. మలబద్దకం దూరం!

by Prasanna |
Constipation : రాత్రి పూట ఇలా చేస్తే.. మలబద్దకం దూరం!
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మంది మలబద్ధకంతో బాధ పడుతుంటారు. వీరికి ఏమి తిన్నా కూడా సరిగా జీర్ణం కాదు. ఈ సమస్య కొన్ని వారాలు పాటు ఉంటుంది. ఇది ఆహారాన్ని సరిగా జీర్ణం కానివ్వదు. కాబట్టి ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మూడు లీటర్ల నీటిని కచ్చితంగా తీసుకోవాలి. దీని వల్ల జీర్ణక్రియను మెరుగుపడుతుంది. ఈ సమస్య స్త్రీలలో 26% మరియు పురుషులలో 16% మందిని ప్రభావితం చేస్తుంది. మీ ఇంటి చిట్కాలతో దీన్ని సులభంగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇక్కడ చూద్దాం..

త్రిఫల

త్రిఫల శరీరం నుంచి అదనపు వాత, పిత్త మరియు కఫాలను తొలగించి మీ శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురాగలదు. కాబట్టి దీన్ని ప్రతి రోజు ఉదయం, అలాగే పడుకునే ముందు 1 టేబుల్ స్పూన్ త్రిఫల పొడిని నీటితో కలిపి తీసుకుంటే మీ పెద్ద ప్రేగు శుభ్రపడి తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది.

నల్ల ద్రాక్ష

నల్ల ద్రాక్షలో ఫైబర్ ఉంటుందని చెబుతుంటారు. ఇది మలానికి పెద్ద మొత్తంలో దోహదం చేస్తుంది అలాగే ప్రేగులు సక్రమంగా పనిచేసేలా ఇవి చేస్తాయి. నాలుగు నుంచి ఐదు నానబెట్టిన నల్ల ద్రాక్ష, రెండు టీస్పూన్ల నల్ల ఎండుద్రాక్షను గోరువెచ్చని నీటిలో కలిపి పడుకునే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Read More: మీ చర్మంపై ఈ లక్షణాలు ఉంటే.. మీ శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నట్లే?

మామిడి ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?




Next Story