- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lifestyle: ఎలాంటి పనులు మన జీవితాన్ని నాశనం చేస్తాయి?
మనం లేచిన దగ్గర నుంచి ఏదోక పని చేస్తుంటాము

దిశ, వెబ్ డెస్క్ : మనం లేచిన దగ్గర నుంచి ఏదోక పని చేస్తుంటాము. అదే పనిగా తిని పడుకుంటే .. ఎవరైనా తిడతారు. చివరికి ఎవరెవతో మాటలు కూడా పడాల్సి వస్తుంది. జాబ్ లేని వారిని చూసి .. తెలిసిన వారు ఉన్నారు.. వారితో చెప్పి జాబ్ చూడమంటావా .. చాలా మంది అంటుంటారు. అలా జరగకుండా ఉండాలంటే.. ఏదొక పని చేయాలి. అయితే, కొందరు కొన్ని పనుల వలన వారి జీవితాలను నాశనం కూడా చేసుకుంటున్నారు. అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు. అప్పటికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది. మరి ఆ పనులేంటో ఇక్కడ చూద్దాం..
కోపంలో నిర్ణయం తీసుకోవడం
మన ముందు నచ్చని విషయాలు మాట్లాడినప్పుడు .. ఒకసారి, రెండు సార్లు చూస్తాము .. మూడో సారి కోపంతో ఏదొక అనేస్తుంటాము. కానీ, కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. అది, అన్నిసార్లు మంచి ఫలితాన్ని ఇవ్వదు. కోపం,బాధ వంటివి మనలోని ఆలోచనా జ్ఞానాన్ని చంపేస్తాయి. రెప్పపాటు క్షణంలో గొడవలు జరగడానికి ఇదే కారణం. అప్పటివరకు మంచిగా సాగుతోన్న జీవితం ముక్కలైపోతుంది.
మాటలు అనడం
కొందరు ముందు, వెనుక ఆలోచించకుండా.. మాటలు అనేస్తూనే అంటారు. నేల మీద పడిన నీటిని, నోటి మాటని వెనక్కి తీసుకోవడం అసాధ్యం. అందుకే నిజ నిజాలు తెలుసుకోకుండా ఎవర్ని మాటలు అనకూడదు. దాని వలన జీవితాలు నాశనం అవుతాయి. కొద్దీ రోజుల తర్వాత మీరు నిజం తెలుసుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పటికి ఒక మనిషి బాధకి మీరు కారణమవుతారు. గొప్పలు , ప్రెస్టేజ్ కోసం హద్దులు దాటి మాట్లాడకూడదు. చెప్పుడు మాటలు విని అయిన వారిని దూరం చేసుకుంటే రేపన్న సాయం చేసే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి, మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.






