iPhoneలో ‘i’ అంటే ఏమిటి? ఇంటర్నెట్ మాత్రం కాదు.. అసలైన స్టోరీ ఇదే...

by Sujitha Rachapalli |

యాపిల్ ప్రొడక్ట్స్ ఐఫోన్, ఐప్యాడ్, ఐపోడ్, ఐమ్యాక్.. గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్‌లో అత్యంత అద్భుతమైన భాగమైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కస్టమర్స్ ఈ డివైజెస్ మీద ఆధారపడి ఉండగా.. మాసివ్ కన్స్యూమర్ బేస్‌తో ఇప్పటికీ యాపిల్ దూసుకుపోతుంది

iPhoneలో ‘i’ అంటే ఏమిటి? ఇంటర్నెట్ మాత్రం కాదు.. అసలైన స్టోరీ ఇదే...
X

దిశ, ఫీచర్స్ : యాపిల్ ప్రొడక్ట్స్ ఐఫోన్, ఐప్యాడ్, ఐపోడ్, ఐమ్యాక్.. గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్‌లో అత్యంత అద్భుతమైన భాగమైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కస్టమర్స్ ఈ డివైజెస్ మీద ఆధారపడి ఉండగా.. మాసివ్ కన్స్యూమర్ బేస్‌తో ఇప్పటికీ యాపిల్ దూసుకుపోతుంది. అయినా సరే ఈ బ్రాండ్‌కు సంబంధించి ఒక్క విషయంలో మిస్టరీ కొనసాగుతూనే ఉంది. అదే iPhoneలో ‘i’ అంటే ఏమిటి? అనేది. చాలా మంది ఇంటర్నెట్ అనుకుంటారు కానీ దీనికి ఐదు గొప్ప కాన్సెప్ట్స్‌తో సంబంధం ఉంది. ఆ బ్రాండ్ ఫిలాసఫీ, విజన్ దాగి ఉంది. అవేంటో తెలుసుకుందాం.

‘i’కు సంబంధించిన స్టోరీ 1998తో ముడిపడి ఉంది. ఈ ఏడాదిలో యాపిల్ ప్రొడక్ట్ ఐమ్యాక్ ఫస్ట్ ఇంట్రడ్యూజ్ అయిన సమయంలో.. యాపిల్ కోఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఇందుకు సంబంధించిన వివరణ ఇచ్చారు. ‘i’లో కంపెనీకి సంబంధించిన విలువలు, విధానాలు దాగి ఉన్నాయని,అవి తమ ప్రొడక్ట్స్‌లో జోడిస్తామని చెప్పుకొచ్చాడు. ‘i’ స్టాండ్స్.. ఇంటర్నెట్, ఇండివిడ్యువల్, ఇన్‌స్ట్రక్ట్, ఇన్‌ఫామ్, ఇన్‌స్పైర్ అని తెలిపాడు. ఈ వివరణ యాపిల్ తమ ఉత్పత్తుల ద్వారా కమ్యూనికేట్ చేయాలనుకున్న ఆలోచనలను సూచిస్తుంది. వ్యక్తులను శక్తివంతం చేయడానికి, వినియోగదారులను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసేందుకు, ఇన్‌స్ట్రక్ట్ చేస్తూ క్రియేటివ్‌గా ఆలోచించేందుకు హెల్ప్ చేస్తుంది. ఇప్పటికీ రిలీజ్ అవుతున్న తమ ప్రొడక్ట్స్‌లో ఈ ఐదు అంశాలు మిళితమై ఉండటం విశేషం.

ఇంటర్నెట్

‘i’ అర్థంలో ఇంటర్నెట్‌తో యాపిల్ అనుసంధానం. ఐమ్యాక్ లాంచ్ చేసినప్పుడు ఇంటర్నెట్ వేగంగా రోజువారీ జీవితంలో భాగమైపోతుంది. యాపిల్ తమ డివైజెస్ యూజర్స్ డిజిటల్ ప్రపంచాన్ని నావిగేట్ చేయడంలో సహాయపడుతాయని హామీ ఇచ్చింది. ఈ విధంగానే ప్రొడక్ట్ డిజైన్ చేయబడిందని నొక్కి చెప్పింది. ఐమ్యాక్ వినియోగదారులను ఇంటర్నెట్‌కు ఈజీగా కనెక్ట్ చేయడానికి నిర్మించబడటమే కాదు వ్యక్తిగత సాంకేతికత భవిష్యత్తును నిర్మించే వెబ్ బేస్డ్ కంప్యూటింగ్ మార్పును సూచిస్తుంది.

ఇండివిడ్యువల్

‘i’.. ఇండివిడ్యువల్(వ్యక్తిగతం) అనే స్టాండ్ కూడా కలిగి ఉంది. ఐమ్యాక్ నుంచి ఐఫోన్ వరకు యాపిల్ ఉత్పత్తులు స్పెషల్ అండ్ కంఫర్టబుల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తూ వినియోగదారులను శక్తివంతం చేసేందుకు రూపొందించబడ్డాయి. కస్టమర్స్‌ తమకు నచ్చినట్లుగా సెట్టింగ్స్, యాప్స్ ద్వారా మార్చుకునేందుకు పర్మిషన్ ఇస్తుంది. వ్యక్తిత్వంపై ఉన్న ప్రాధాన్యత ఆ సమయంలో యాపిల్‌ను ఇతర కంపెనీల నుంచి భిన్నంగా మార్చింది.

ఇన్‌స్ట్రక్ట్

‘i’.. ఇన్‌స్ట్రక్ట్(బోధన) అనే అర్థాన్ని సూచిస్తుంది. యాపిల్ తన పరికరాలను టూల్స్‌కు సంబంధించింది మాత్రమే కాదు విద్యకు సంబంధించిన బోధనగా కూడా మార్చింది. డిజిటల్ లెర్నింగ్ టూల్స్, ఎడ్యుకేషన్ యాప్స్, ఇన్ఫర్మేషన్ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వినియోగదారులకు కొత్త నైపుణ్యాలను అందించే కంపెనీగా మన్ననలు పొందింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు అభ్యాస వనరులను అందించే లక్ష్యంతో యాపిల్ ఎడ్యుకేషన్ వంటి సేవలను ప్రవేశపెట్టడంలో గణనీయమైన పాత్ర పోషించింది.

ఇన్‌ఫామ్

‘i’ ఈజ్ ఈక్వల్ టూ ఇన్‌ఫామ్. ఇది యాపిల్ తమ వినియోగదారులకు సమాచారం, జ్ఞానాన్ని అందించడంలో నిబద్ధతను హైలెట్ చేస్తుంది. ఫస్ట్ ప్రొడక్ట్ ఐమ్యాక్ నుంచి తాజా ఐఫోన్ వరకు సకాలంలో సమాచారాన్ని అందించడంలో సక్సెస్ అయింది. ఇందుకు స్ట్రాంగ్ ప్రయారిటీ ఇచ్చింది. వెబ్ బ్రౌజింగ్ కోసం సఫారీ వంటి అంతర్నిర్మిత యాప్స్, బ్రేకింగ్ న్యూస్ కోసం పుష్ నోటిఫికేషన్స్.. ఇలా ఒక్క బటన్ నొక్కితే సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసేలా పరికరాలను రూపొందించింది.

ఇన్‌స్పైర్

చివరగా ‘i’ ప్రేరణను సూచిస్తుంది. యాపిల్ ఎప్పుడూ తమ ఉత్పత్తులు, డిజైన్‌లో క్రియేటివిటీ, ఇన్నోవేషన్‌ను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, శక్తివంతమైన పనితీరు సామర్థ్యం వినియోగదారులను భిన్నంగా ఆలోచించేందుకు, సరిహద్దులను అధిగమించేందుకు ప్రోత్సహిస్తుంది. కొత్తగా నేర్చుకునేందుకు, క్రియేట్ చేసేందుకు, అన్వేషించేందుకు ప్రేరణను రేకెత్తిస్తుంది.

Next Story