Solo polyamory: శృంగారంలో కొత్త ట్రెండ్ ..ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు

by Vennela |

Solo polyamory: వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోవడం కంటే నరకమైనది ఏదీ ఉండదు.

Solo polyamory: శృంగారంలో కొత్త ట్రెండ్ ..ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు
X

దిశ, వెబ్ డెస్క్: Solo polyamory: వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోవడం కంటే నరకమైనది ఏదీ ఉండదు. పెళ్లిళ్ల కారణంగా చాలా మంది మహిళలు స్వేచ్ఛ, స్వతంత్రలను కోల్పోతుంటారు. అందుకే వారి కోసం కొత్త ట్రెండ్‌లు పుట్టుకొస్తున్నాయి. అలాంటి ఒక వింత ట్రెండ్‌ గురించి మీకు చెప్పబోతున్నాం

లోకం మారుతోంది.. ట్రెండ్ కూడా మారుతోంది.. మనుషుల ఆలోచనా విధానాలు కూడా ఊహించని విధంగా మార్పులకు గురవుతున్నాయి. ఇప్పుడు చాలా మందికి పెళ్లి అంటే ఇంట్రెస్ట్ ఉండడం లేదు. ఎందుకంటే అది చాలా బాధ్యతతో కూడిన వ్యవహరం. కొన్నిసార్లు భరించలేని తలనొప్పి వ్యవహారం కూడా. అందుకే రిలేషన్‌షిప్స్‌ విషయంలో కొత్త ట్రెండ్లు పుట్టుకొస్తున్నాయి. అందులో సోలో పాలియోమరీ ఒకటి.. ఇది చాలా డిఫరెంట్‌ ట్రెండ్‌.

సోలో పాలియోమరీ అంటే వ్యక్తి స్వతంత్రతను ప్రాధాన్యమిస్తూ ఎంతమందితోనైనా సాన్నిహిత సంబంధాలను పెట్టుకునే కాన్సెప్ట్. ఈ ట్రెండ్‌ ఫాలో అయ్యేవారు తమ భాగస్వాములతో సహజీవనం చేయరు. ఆర్థిక బాధ్యతలను పంచుకోరు లేదా పెళ్లి లాటి సంప్రదాయ సంబంధాల లక్ష్యాలను ఆశించరు. కేవలం రొమాన్స్‌ లాంటి వాటికి ప్రాధాన్యతనిస్తారు. ఈ జీవనశైలి తాత్కాలికం లేదా శాశ్వతం కావచ్చు. ముఖ్యంగా, ఇది ప్రేమ, నిబద్ధతలను వ్యక్తిగతంగా నిర్వచించుకునే అవకాశం ఇస్తుంది. ఇది సంప్రదాయ బంధాల అంచనాలను దాటిపోయి సంబంధాలను కొత్తగా ఆలోచించడానికి మార్గాన్ని చూపుతుంది.

ఈ ట్రెండ్‌కు ఎక్కువ మంది మహిళలు ఎందుకు ఆకర్షితులవుతున్నారు?

సంప్రదాయ పెళ్లిళ్లలో ముందుగా మహిళ స్వతంత్రతను కోల్పోతుంది. అందుకే ఇటివలి కొంతమంది మహిళలకు పెళ్లి అంటేనే నచ్చడంలేదు. భయపడిపోతున్నారు. శాడిస్ట్ భర్త వస్తే టార్చర్ మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి టార్చర్లు భరించలేని వారికోసమే ఈ కొత్త కొత్త ట్రెండ్స్‌ పుట్టుకొస్తున్నాయి. 2020లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం, 32 దేశాల్లో పెళ్లి రేట్లు 20 శాతం తగ్గాయి. ఇదే విషయాన్ని బ్లూమ్ సర్వే చెప్పింది. మహిళల ఆర్థిక, భావోద్వేగ, లైంగిక స్వేచ్ఛ పెరగడంతో, నిబద్ధత పట్ల కొత్త దృక్పథం వెలువడుతోంది. దీంతో సోలో పాలియోమరీలో ఉండే ప్రేమ, స్వాతంత్ర్యాన్ని కలిపి ఒక కొత్త జీవనశైలిని అనుభవిస్తున్నారు.

సోలో పాలియోమరీ ప్రతి ఒక్కరికి సరిపడే జీవనశైలి కాదు. కానీ మీకు వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమైతే, సంబంధాలను కొత్తగా నిర్వచించాలనుకుంటే ఇది మీకు సరిపోతుంది. సోలో పాలియోమరీ ద్వారా ప్రేమకూ వ్యక్తిగత జీవితానికీ మధ్య సమతుల్యాన్ని సాధించవచ్చు. ఇది సంప్రదాయ సంబంధాలపై కొత్తగా ఆలోచించడానికి మార్గం చూపుతుంది.

Next Story