- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసలు OCD అంటే ఏమిటి? నీకు నిజంగా OCD ఉందా?
‘‘నాకు OCD ఉంది’’ అని ఈ మధ్య చాలా మంది అంటున్నారు. ఆ పదాన్ని నార్మలైజ్ చేసేశారు. కానీ ఇది చాలా గంభీరత, బరువు కలిగిన పదం. దాని నిజమైన అర్థం తెలియక తక్కువగా అంచనా వేస్తున్నాం. నార్మల్‌గా వాడేస్తున్నాం.

దిశ, ఫీచర్స్ : ‘‘నాకు OCD ఉంది’’ అని ఈ మధ్య చాలా మంది అంటున్నారు. ఆ పదాన్ని నార్మలైజ్ చేసేశారు. కానీ ఇది చాలా గంభీరత, బరువు కలిగిన పదం. దాని నిజమైన అర్థం తెలియక తక్కువగా అంచనా వేస్తున్నాం. నార్మల్‌గా వాడేస్తున్నాం. మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ వీక్, బ్రేక్ ది స్టిగ్మా లాంటి హెల్త్ క్యాంపెయిన్స్ జరుగుతున్నా.. ఇంకా OCD అంటే తెలియని అజ్ఞానులుగా మిగిలిపోయాం.
OCD అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందనేది కొందరిచ్చే స్టుపిడ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇది ఏదో నీట్‌గా ఉండటమో, లేదంటే ఓ సినిమాలో చెప్పినట్లుగా ఆ నీట్‌నెస్ లేకపోతే కామెడీగా రియాక్ట్ కావడమో కాదు. ఇది ఒక తీవ్రమైన మానసిక రుగ్మత. అవాంఛిత ఆలోచనలు, భయాలు కలిగిన హెల్త్ ఇష్యూ. లక్షణాలు ఒకరి నుంచి మరొకరికి మారుతుంటాయి. అబ్సెషన్స్ బేస్ చేసుకుని తేడాలు ఉంటాయి. చేసిన పనినే మళ్లీ చేయడం వల్ల బలహీనత, అలసట వారిని మరింత కుంగిపోయేలా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో పక్కన ఉన్నవారిని కూడా ఇబ్బంది పెట్టే అవకాశముంది. అయితే బలవంతంగా ఆ ఆలోచనల నుంచి మనసును కంట్రోల్ చేస్తే తాత్కాలికంగా తగ్గుతాయి.
సదరు రోగి మనస్సుపై బలమైన పట్టును కలిగి ఉన్న అబ్సెసివ్-కంపల్సివ్ బిహేవియర్ కలిగి ఉంటాడు. ఒకవేళ చర్య తీసుకోకపోతే ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకుండా ఏళ్లపాటు అలాగే ఉండిపోగలడు. ఉదాహరణకు సాధారణ వ్యక్తి అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మెయిన్ డోర్ లాక్ చేసి హడావిడిగా పని ఉందంటూ వెళ్లిపోతాడు. అదే అబ్సెసివ్ బిహేవియర్ కలిగిన రోగి.. మెయిన్ డోర్‌కు ఏడుసార్లు తాళం వేసినా మళ్లీ ఓసారి వేద్దాం.. ఏదైనా జరిగితే ఎలా అనే ఆలోచనతో నిమగ్నమై ఉంటాడు. మరో ఎగ్జాంపుల్ ఏంటంటే.. రోజంతా పని చేసి అలసిపోయి నిద్రపోయే టైమ్ వచ్చింది. నార్మల్ పీపుల్ అయితే మొబైల్ చూస్తూనో, ముచ్చట్లు పెడుతూనో.. అది అయిపోయాక లైట్ ఆఫ్ చేసి ఎంచక్కా బజ్జుంటారు. కానీ ఈ ఓసీడీ ఉన్న వ్యక్తి మాత్రం తాను మనసులో అనుకున్నన్ని సార్లు లైట్లు ఆన్ చేసి ఆఫ్ చేయకపోవడం కూడా దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందనే భయంతో ఉంటాడు. రాత్రంతా అలాగే లైట్స్ ఆఫ్ చేస్తూ ఆన్ చేసి కూర్చున్నా ఆశ్చర్యం లేదు. ఇవన్నీ హాస్యాస్పదంగా అనిపించినా.. సాధారణ పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. తప్పించుకునే పరిస్థితి లేక అక్కడే లొంగిపోయి ఉండే మార్గం మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి దానిని తక్కువ చేసి చూపించడం ఆపండి. కళంకాన్ని తొలగించండి.
ట్రీట్మెంట్
* సైకోథెరపీ : కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) అనే మానసిక చికిత్స OCD ఉన్న చాలా మందికి ప్రభావవంతంగా ఉంటుంది. CBT చికిత్సలో భాగమైన ఎక్స్‌పోజర్, రెస్పాన్స్ ప్రివెన్షన్ (ERP).. కంపల్సివ్ బిహేవియర్ నుంచి బయటపడేస్తాయి. దీంతో మెరుగైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు.
* మెడిసిన్ : కొన్ని మానసిక మందులు OCD కారణంగా చేసే పనులను నియంత్రించడంలో సహాయపడతాయి. సాధారణంగా యాంటిడిప్రెసెంట్లను ముందుగా ప్రయత్నిస్తారు. ఏడు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ఫ్లూక్సేటైన్ (ప్రోజాక్), ఎనిమిది, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ఫ్లూవోక్సమైన్ (లువోక్స్), పెద్దలకు మాత్రం పరోక్సేటైన్ (పాక్సిల్) యాంటీ డిప్రెసెంట్స్ సూచించబడుతాయి.






