- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: RCB టీంలో మోదీ.. చెన్నై టీంలో అమిత్ షా.. ఆ టీంలో రాహుల్ గాంధీ.. ఇక టఫ్ ఫైట్ తప్పదా?
Viral Video: ధోనీ హెలికాప్టర్ షాట్ కొడితే చూడముచ్చటగా ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ధోనీ హెలికాప్టర్ షాట్ కొడితే చూడముచ్చటగా ఉంటుంది.. రోహిత్ శర్మ పుల్ షాట్ ఆడితే భలే ఎంజాయ్ చేస్తాం.. అలానే విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ ఆడినా ఆనందిస్తాం. ఇలా ప్రపంచ క్రికెట్ లో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. అచ్చం ఇలా రాజకీయాల్లోనూ ఒక్కో నాయకుడికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది.
ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అమిత్ షా వంటి నేతలు గత కొన్ని దశబ్దాలుగా తమదైన శైలిలో రాణిస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అయితే వీళ్లంతా ఒక్కసారిగా రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి.. క్రికెట్ ఆడితే ఎలా ఉంటుందో చూడాలనే వారి కోరికను ఓ నెటిజన్ తీర్చాడు. ఐపీఎల్ కొనసాగుతున్న వేళ ఒక్కో నాయకుడ్ని ఒక్కో టీంలో చేర్చి వీడియోలు ఎడిట్ చేశాడు.
అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. ఎవరికి నచ్చిన నాయకుడిని వారు కామెంట్స్ చేస్తుండగా.. హీరోస్ నుంచి కూడా మరో టీమ్ సిద్ధం చేయండి అంటూ ఇంకొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఐపీఎల్ జెర్సీలు నాయకులకు సూపర్ గా సెట్ అయ్యాయాంటూ హ్యాపీగా ఫీలవుతున్నారు.






