poison : మీపై విషప్రయోగం జరిగిందని ఎలా తెలుసుకోవచ్చు

by Sujitha Rachapalli |

పాయిజనింగ్ అంటే ఒక వ్యక్తి ప్రాణాలకు ముప్పు కలిగించే పదార్థానికి ఎక్స్‌పోజ్ కావడం. కాగా విషం వ్యక్తిని ప్రభావితం చేసే తీరు పాయిజన్ టైప్, సైజ్‌పై ఆధారపడి ఉంటుంది. నిజానికి విష ప్రయోగం అంటే పాములు, మంత్రగత్తెలు మన బ్రెయిన్‌లోకి రావడం కామన్

poison : మీపై విషప్రయోగం జరిగిందని ఎలా తెలుసుకోవచ్చు
X

దిశ, ఫీచర్స్ : పాయిజనింగ్ అంటే ఒక వ్యక్తి ప్రాణాలకు ముప్పు కలిగించే పదార్థానికి ఎక్స్‌పోజ్ కావడం. కాగా విషం వ్యక్తిని ప్రభావితం చేసే తీరు పాయిజన్ టైప్, సైజ్‌పై ఆధారపడి ఉంటుంది. నిజానికి విష ప్రయోగం అంటే పాములు, మంత్రగత్తెలు మన బ్రెయిన్‌లోకి రావడం కామన్. కానీ మెడికల్ టెర్మినాలజీ చాలా బ్రాడ్‌గా, డ్రమాటిక్‌‌గా ఉంటుంది. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని దెబ్బతీసే లేదా ప్రాణాంతకంగా మారే పదార్థానికి గురికావడంగా పరిగణిస్తారు. ఇంతకీ పాయిజనింగ్ ఎలా జరుగుతుంది? ఎక్కువ ప్రమాదంలో ఉంది ఎవరు?

పాయిజన్ రకాలు

* విషపూరిత పదార్థాలు అనేక రకాలుగా ఉంటాయి. మన బాడీలోకి వెళ్లేందుకు కూడా అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు విషం మింగవచ్చు, ఇంజెక్ట్ చేయవచ్చు, చర్మం ద్వారా గ్రహించవచ్చు.

* విషప్రయోగపు అత్యంత సాధారణ రూపం మెడిసిన్ ఓవర్ డోస్. ఇది ప్రిస్క్రిప్షన్ ద్వారా లేదా కౌంటర్ ద్వారా తీసుకోబడుతుంది.

* ఇతర సాధారణ విషాలలో వాయువులు (కార్బన్ మోనాక్సైడ్ వంటివి), గృహోపకరణాలు (బ్లీచ్ వంటివి), సౌందర్య సాధనాలు (నెయిల్ పాలిష్ వంటివి) ఉన్నాయి.

* బూజు పట్టిన ఆహారం, లేదా సరిగ్గా వండని, తక్కువగా ఉడికించిన ఫుడ్ విషపూరితం కావచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో మద్యం సేవించడం కూడా బాడీపై పాయిజన్‌గా పనిచేస్తుంది.

* కొన్ని పదార్థాలు తక్కువ పరిమాణంలో ఉన్నా ప్రాణాంతకం కావచ్చు. ఉదాహరణకు, కార్బన్ మోనాక్సైడ్ శరీరం ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుంది. బ్లీచ్ జీర్ణవ్యవస్థను మంట పుట్టిస్తుంది. చికాకుపెడుతుంది.

లక్షణాలు

* విషప్రయోగం లక్షణాలు కేసును బట్టి చాలా మారుతూ ఉంటాయి. కానీ వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, మగత, తలతిరగడం, బలహీనత, జ్వరం, తలనొప్పి వంటివి సాధారణ లక్షణాలు.

* చిన్న పిల్లలు అకస్మాత్తుగా మగతగా ఉండటం లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతే పాయిజనింగ్ జరిగిందని అర్థం చేసుకోవాలి.

* ఇక ట్యాబ్లెట్స్ అధిక మోతాదు విషప్రయోగానికి సాధారణ కారణం. ఉదాహరణకు పారాసెటమాల్ అధిక మోతాదు తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం, సమన్వయం కోల్పోవడం, చర్మం, కళ్ళలోని తెల్లసొన పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

* బీటా బ్లాకర్లతో విషప్రయోగపు నిర్దిష్ట సంకేతాలలో తక్కువ రక్తపోటు ఒకటి కాగా తల తిరగడం, మూర్ఛపోవడానికి కారణమవుతుంది. హృదయ స్పందన రేటు నిమిషానికి 60 బీట్ల కంటే తక్కువగా ఉంటుంది.

మెడికల్ హెల్ప్

* విషప్రయోగం ప్రాణాంతకం కావచ్చని గుర్తుంచుకోవడం ముఖ్యం. కాబట్టి పాయిజనింగ్ అయిందని అనుమానించినట్లయితే వెంటనే సహాయం తీసుకోవాలి.

* సదరు వ్యక్తికి సమర్థవంతంగా చికిత్స చేయడానికి.. వైద్య సిబ్బంది వివరణాత్మక హిస్టరీని తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు ఆ వ్యక్తి ఏ పదార్థాన్ని తీసుకున్నాడు.. ఎప్పుడు, ఎందుకు, ఎలా తీసుకున్నారో వైద్య సిబ్బంది తెలుసుకోవాలి. వయస్సు, బరువు, అనారోగ్య వైద్య పరిస్థితులు ఉన్నాయా, ఏవైనా మందులు వాడుతున్నారా అనే విషయాలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది.

* కొన్ని సందర్భాల్లో రక్త పరీక్షలు, ఎకోకార్డియోగ్రామ్ ఉండవచ్చు.

* వైద్యులు రోగికి చికిత్స చేయడానికి యాక్టివేటెడ్ చార్‌కోల్‌ను ఉపయోగించవచ్చు. ఆ పదార్థం విషాన్ని బంధించి, రక్తంలోకి మరింత శోషించబడకుండా ఆపుతుంది.

* అయితే, విషప్రయోగానికి చికిత్స చేయడానికి ప్రయత్నించడం కంటే దానిని నివారించడం చాలా మంచిది.

ఎవరికి ఎక్కువ ప్రమాదం?

* ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు విషప్రయోగం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రమాదాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.

* ఉదాహరణకు మెడిసిన్, ఇంటిని శుభ్రపరిచే ప్రొడక్ట్స్, ఇతర హానికరమైన రసాయనాలను పిల్లలకు కనిపించకుండా, వారికి అందకుండా దూరంగా లాక్ చేయాలి.

Next Story