సెక్స్ తర్వాత ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదే..!

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-11-13 11:04:14  IST  )

శృంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరిని కలపాలన్నా.. ఇద్దరిని విడదీయాలన్నా అది శృంగారానికే చెల్లింది.

సెక్స్ తర్వాత ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : శృంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరిని కలపాలన్నా.. ఇద్దరిని విడదీయాలన్నా అది శృంగారానికే చెల్లింది. వాత్సాయనుడు ఈ శృంగారంపై ఏకంగా ‘కామసూత్ర’నే రచించి సెక్స్‌పై అవగాహన కల్పించాడు. సెక్స్ మనిషిని ఉల్లాసంగా, ఉత్సహంగా, ఆరోగ్యంగా ఉంచుతుందనడంలో సందేహం లేదు. రోజూ సెక్స్ చేయడం వల్ల జబ్బులు కూడా దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. కనీసం వారానికి రెండుసార్లైనా శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యవంతులుగా ఉంటారని సెక్సాలజిస్టులు పేర్కొంటున్నారు.ఇదేలా ఉన్నా.. శృంగారం సమయంలో ఎలా ప్రవర్తించాలి..? భాగస్వామిని ఎలా తృప్తి పరచాలి..? ధృడమైన బంధం ఏర్పడేలా శృంగారం ఎలా చేయాలి అనే స్పష్టత నేటి జంటల్లో కొరవడిందనే చెప్పాలి. సెక్స్‌ను కొంత మంది ఏదో మొక్కుబడిగా ‘మమ’ అనిపిస్తున్నారని, దీని వల్లనే దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయని ఫ్యామిలీ కౌన్సిలర్లు గగ్గోలు పెడుతున్నారు. పడక గదిని యాంత్రికంగా మార్చి రెండు నిమిషాల్లో ‘పని’ ముగించి పక్కకు తిరిగి పడుకుంటున్నారు. అయితే శృంగార సమయంలో ఆడవాళ్లకూ కొన్ని ఇష్టాఅయిష్టాలు ఉంటాయి. తమ భాగస్వామిని మైమరిపించాలని వాళ్లు తపిస్తారట. కానీ కొంత మందిలో అది నిరాశగానే మారుతుందట.కొందరు మగవాళ్లు నేరుగా సెక్స్‌లోకి దిగి మొక్కుబడిగా ముగించేస్తారు. మరి కొందరు తన భాగస్వామిని ఊరిస్తూ.. కామదేవతను తట్టిలేపుతూ మైమరిపిస్తారు. కామ నాడులను స్పృశిస్తూ ఉద్రేకం తెప్పిస్తారు. ఆ తర్వాత సృష్టికార్యంలోకి దిగి ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు ఓ యుద్ధమే చేస్తారు. అయితే పురుషుడు ఎంత తృప్తికరంగా సెక్స్ చేసినా స్కలనం తర్వాత భాగస్వామిని పట్టించుకోకుండా పక్కకు తిరిగి పడుకుంటారు. ఈ విషయమే మహిళల్లో అసంతృప్తికి కారణం అవుతుందట. ‘పని’ ముగియగానే తనకేం సంబంధం లేదన్నట్లు పక్కకు పోకుండా ఆమెను హత్తుకోవడం.. ముద్దులు పెట్టడం.. ప్రేమగా తల నిమరడం.. కాసేపు ఆమెను పెనవేసుకోని పడుకోవడం చేయాలట. ఇదే ప్రతి మహిళ సెక్స్ అనంతరం కోరుకుంటుందని ఫ్యామిలీ కౌన్సిలర్లు చెబుతున్నారు. వారి వద్దకు వచ్చే జంటల్లో అధిక మంది మహిళలు సెక్స్ సమయంలో తమ భర్త ఇలాగే ప్రవర్తిస్తున్నాడని వాపోతున్నారట. అందుకే మగ మహారాజులు సెక్స్ తర్వాత తమ భాగస్వామి ఎదపై కాసేపు వాలిపోతే ఆ బంధం బలంగా మారుతుందంటున్నారు.

Next Story