గడ్డి, కాక్టస్ గుజ్జుతో వాటర్ ట్యాంకులు.. మొరాకో ఎడారి ప్రజల ఫ్రిజ్‌లు ఇవే..

by Javid Pasha |

సహజ సిద్ధంగా గడ్డి, ఆకులతో తయారు చేసే ‘మట్ఫియాస్’.. అంటే వాటర్ ట్యాంకుల తయారీలో ఎటువంటి ప్లాస్టిక్ కానీ, ఇతర పదార్థాలు కానీ వాకుండా సాంప్రదాయ చేతివృత్తితో తయారు చేస్తారు.

గడ్డి, కాక్టస్ గుజ్జుతో వాటర్ ట్యాంకులు.. మొరాకో ఎడారి ప్రజల ఫ్రిజ్‌లు ఇవే..
X

దిశ, ఫీచర్స్ : తాగు నీరు చల్లగా ఉండాలంటే.. మనం ఫ్రిజ్‌లు వాడుతాం. ఇక తాగునీటి వాటర్ ట్యాంకుల్లో అయితే ఎండాకాలం తప్ప మిగతా సీజన్లలో నీరు చల్లగానే ఉంటుంది. కానీ మొరాకో దేశంలోని ఎడారి ప్రాంతంలో అలా కాదు. ఇక్కడ ఎండతాకిడి, వేడి ఎక్కువ కాబట్టి నీటి వనరుల్లో, ఇండ్ల వద్ద ట్యాంకుల్లో నిల్వనీరు చాలా త్వరగా వేడెక్కుతుంది. అయితే ఈ సమస్యకు సహజ సిద్ధమైన, పర్యావరణ హితమైన ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నారు స్థానిక ప్రజలు. పూర్తిగా గడ్డి(Palm grass or daum leaves)తో అల్లి, కాక్టస్ (బ్రహ్మజెముడు మొక్క)గుజ్జుతో సీల్ చేయబడిన వాటర్ ట్యాంకులను వాడుతున్నారు. వీటిని ‘మట్ఫియాస్ (Matfias)’ అని పిలుస్తారు.

సహజ సిద్ధంగా గడ్డి, ఆకులతో తయారు చేసే ‘మట్ఫియాస్’.. అంటే వాటర్ ట్యాంకుల తయారీలో ఎటువంటి ప్లాస్టిక్ కానీ, ఇతర పదార్థాలు కానీ వాకుండా సాంప్రదాయ చేతివృత్తితో తయారు చేస్తారు. ఇందులో గడ్డి అల్లికలతో కూడిన నిర్మాణానికి కాక్టస్ గుజ్జు (Natural mucilage)ను అప్లయ్ చేయడం ద్వారా లీక్‌లను నిరోధించే వాటర్ ప్రూఫ్ లేయర్‌ను(Waterproof layer) రూపొందిస్తారు. తమ పురాతన చేతివృత్తిని ఆధునిక సుస్థిరతతో సమన్వయం చేసే ఈ పర్యావరణ అనుకూల వాటర్ ట్యాంకులు (Matfias) తీవ్రమైన వేడి గల ఎండ వాతావరణంలో కూడా నీటిని చల్లగా ఉంచుతాయి. ముఖ్యంగా మొరాకో అబ్దా(Abda) ప్రాంతంలోని ఎడారి, సెమీ-ఎరిడ్ రూరల్ ప్రాంతాల్లో ఈ పర్యావరణ హితమైన వాటర్ ట్యాంకులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. Link

Next Story