- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: అరేయ్ ఏంట్రా ఇది.. కారును ఇలా కూడా వాడుతారా.. అల్లం, వెల్లుల్లి దంచడం కోసం వీడు ఏం చేస్తున్నాడో చూడండి
Viral Video: సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు ఒక్కోసారి చాలా నవ్వు తెప్పిస్తుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు ఒక్కోసారి చాలా నవ్వు తెప్పిస్తుంటాయి. కొంతమంది చేసే పనులు మనకి అవి తెలివితేటలు ఎక్కువై చేస్తున్నారా లేక తెలివి తక్కువ చేస్తున్నారా అన్న సంగతి మనకి అర్థం కాదు. ఎందుకంటే వారి పనులు అలా ఉంటాయి. తాజాగా ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ఒక ప్లాస్టిక్ బాటిల్ లో అల్లం వెల్లుల్లి పాయలు వేసి దానిని ఓ కారు ముందు టైర్ కింద పెట్టి ముందుకు వెనక్కి కలుపుతూ వాటిని ముద్ద చేస్తున్నాడు.
అల్లం వెల్లుల్లి నూరుకోవడానికి మిక్సీలు, రోలు రోకళ్ళు ఇన్ని ఉండగా, ఈ కంటెంట్ క్రియేటర్ కి ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఇలాంటివి చేస్తుంటారని మరికొందరు కామెంట్స్ లో పెడుతుంటే మరికొందరు మాత్రం అతని ఐడియాకు అతడు బుర్రకు ఒక స్థలం అని మరొక యూజర్ కామెంట్ పెడుతున్నాడు.
అతడు పడుతున్న తాపత్రయానికి ఒక లైక్ కొట్టేద్దామని మరో యూజర్ కామెంట్ పెడుతుంటే, అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి రా బాబు అని మరో యూజర్ కామెంట్ పెట్టేశాడు. మొత్తానికి సోషల్ మీడియాని ఇలా తెగ వాడేస్తున్నారు అని చెప్పవచ్చు. అటు అల్లం వెల్లుల్లి దంచడానికి అంత పెద్ద కారును ముందుకు వెనక్కు కదిలిస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త రా తమ్ముడు మీ చేయి గనుక కారు కిందకి వెళ్ళింది అంటే అల్లం వెల్లుల్లి బదులు నీ చేయి పచ్చడి అవుతుందని మరో యూజర్ బాంబు పేల్చాడు.
మొత్తానికి సోషల్ మీడియా కోసం ఇలాంటి ప్రమాదకరమైన కంటెంట్ చేయడం అంత మంచిది కాదని మరికొందరు సూచిస్తున్నారు. రీల్స్ కు వచ్చే వ్యూస్ కన్నా మన చెయ్యి ఎంతో విలువైనది అని, అది గనుక పచ్చడి అయితే తిరిగి అతికించలేమని మరికొందరు బుద్ధి జీవులు సలహా ఇస్తున్నారు.






