IRCTC Tour: వేసవి సెలవుల్లో జ్యోతిర్లింగాలు సందర్శించుకోవాలనుకుంటున్నారా? మీకోసమే స్పెషన్ ప్లాన్!

by Yella Dhawani Reddy |

వేసవి సెలవులు వచ్చేశాయ్.

IRCTC Tour: వేసవి సెలవుల్లో జ్యోతిర్లింగాలు సందర్శించుకోవాలనుకుంటున్నారా? మీకోసమే స్పెషన్ ప్లాన్!
X

దిశ, వెబ్ డెస్క్: వేసవి సెలవులు వచ్చేశాయ్. ఈ సందర్భంగా చాలా మంది కుటుంబసభ్యులతో, స్నేహితులతో కలిసి టూర్లు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అనేక ప్యాకేజీలను అందిస్తోంది. ఇందులో భాగంగా సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర నిర్వహించనుంది. ఈ యాత్రలో భాగంగా ఉజ్జయిని, ద్వారకా, సోమ్‌నాథ్‌, పూణే, నాసిక్‌, ఔరంగాబాద్‌ మీదుగా 12 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. మరీ ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు ఈ స్టోరీలో మీకోసం.

ఐఆర్‌సీటీసీ 'సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర' పేరుతో ఈ టూర్‌ను ప్లాన్ చేసింది. ఈనెల 8న రాత్రి 9 గంటలకు ఈ యాత్ర విజయవాడ నుంచి ప్రారంభంకానుంది. ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, నాందేడ్, పూర్ణాలలో ప్రయాణికులను బోర్డింగ్ సదుపాయం కల్పించారు. మొత్తం 11 రాత్రులు, 12 పగళ్లులో సాగే ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న వారికి.. స్లీపర్‌, థర్డ్‌ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్‌లలో ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తారు.

టూర్‌ ధర వివరాలు..

ఐఆర్‌సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర రైలు టికెట్‌ ధర పెద్దలకు స్లీపర్‌ కోచ్‌ రూ.20,890గా నిర్ణయించారు. సెకండ్‌ ఏసీ రూ.44,375, థర్డ్‌ ఏసీ రూ.33,735గా ధరను నిర్ణయించారు. అలాగే, 5-11 ఏళ్లలోపు పిల్లలకైతే స్లీపర్‌ రూ.19,555, సెకండ్‌ ఏసీ 42,485, థర్డ్‌ ఏసీ రూ.32,160గా ఉంది. ఒంటరిగా బుకింగ్ చేసుకున్న పర్యాటకులు ఆక్యుపెన్సీని ఇతరులతో కలిసి పంచుకోవాల్సి ఉంటుంది.

ఈ యాత్రకు వచ్చే వారికి ప్రయాణ బీమా సౌకర్యం, రైలులో యాత్రికుల భద్రతకు ఎస్కాట్‌ ఏర్పాట్లు చేశారు. యాత్రికులకు ప్రతి రోజూ ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి శాకాహార భోజనం ఉంటుంది. టూర్ ప్లాన్ ప్రకారం.. బడ్జెట్‌ హోటళ్లలో రాత్రి బస ఏర్పాటు చేస్తారు. అలాగే రైలు దిగి ఆయా క్షేత్రాలు సందర్శించేందుకు ప్రత్యేక వాహనాలనుకూడా ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేస్తుంది. టూర్‌ వివరాల కోసం IRCTC అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. లేదా 9281495848, 9281030714 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.

Next Story