బరువు పెరగాలి అనుకుంటున్నారా? అయితే ఇవి తినండి!

by Yella Dhawani Reddy |

జీడిపప్పు.. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బరువు పెరగాలి అనుకుంటున్నారా? అయితే ఇవి తినండి!
X

దిశ, వెబ్ డెస్క్: జీడిపప్పు.. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఒక బలమైన పోషకాలను కలిగి ఉన్న డ్రై ఫ్రూట్. కేవలం మంచి రుచి మాత్రమే కాదు.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులోని పుష్కలమైన పోషకాలు శరీరానికి శక్తిని అందించడంలో, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తాయి. జీడిపప్పులో ముఖ్యంగా కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే మంచి స్నాక్‌లలో ఒకటి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచుపదార్థాలు, ప్రోటీన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. వీటి వలన శరీరానికి కావాల్సిన పోషణ పూర్తవుతుంది.

ఇక బరువు పెరగాలనుకునే వారు సాధారణంగా ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి వారికోసం జీడిపప్పు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలాగే జీడిపప్పులోని ఫైబర్ శరీరానికి మరొక విధంగా మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం ఎక్కువ సేపు ఆకలిని దూరం చేస్తుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో తినే ఆహారపు మొత్తాన్ని నియంత్రించవచ్చు. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వారు కూడా జీడిపప్పును మితంగా తీసుకుంటే ఉపయోగపడుతుంది. ఇక జీడిపప్పును తినే విధానం కూడా చాలా ముఖ్యం. నేరుగా తినడం కన్నా వేయించి లేదా ఉప్పు కలిపి తినడం వల్ల అదనపు కేలరీలు చేరతాయి. బరువు పెరగాలనుకునే వారికి ఇది మేలు చేస్తుంది.

జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులో రక్త కొలెస్ట్రాల్‌ను నియంత్రించే స్టెరిక్ ఆమ్లం ఉంటుంది. జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. జీడిపప్పులో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. విటమిన్లు, ఫైబర్, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే, ఇతర గింజలతో పోలిస్తే కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కాయలు మధుమేహం యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఎందుకంటే అవి ఫైబర్ అధికంగా ఉన్నందున రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తాయి.

Next Story