- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Together for Poonch.. యుద్ధం ఆగితే రుతుస్రావం ఆగుతుందా.?
కదలండీ.. టుగెదర్ ఫర్ పూంచ్ పిలుస్తోంది.. తలా ఓ చేయి వేద్దాం.!

యుద్ధం ఆగుతుంది.
కాల్పులు ఆగుతాయి.
ఆందోళనలు ఆగిపోతాయి.
భయాలు తగ్గిపోతాయి.
కానీ..
రుతుస్రావం ఆగిపోతుందా.?
యుద్ధం జరిగినా.. బాంబులు పడినా.. పిడుగుపడి దిక్కులు పిక్కటిల్లినా..
రుతుస్రావం జరిగేది జరుగుతూనే ఉంటుంది.
మరి.. "పూంచ్" మహిళలకు "ప్యాడ్"లెందుకు అందించొద్దు.?
కదలండీ.. టుగెదర్ ఫర్ పూంచ్ పిలుస్తోంది.. తలా ఓ చేయి వేద్దాం.!
- దిశ, ఫీచర్స్
ఒక అధ్యయనం ప్రకారం.. "సంఘర్షణ" సమయాల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 6,91,300 మంది మహిళలు.. యువతులు రుతుస్రావ నిర్వహణలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యుద్ధ సమయాల్లో. పూంచ్ వద్ద పాకిస్తాన్ "లైవ్‌షెల్" ప్రయోగించి మహిళలకు సమస్యలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే "టుగెదర్ ఫర్ పూంచ్" స్టార్టయ్యింది.
రుతుస్రావ శుభ్రతే..
పూంచ్‌లో జరిగిన షెల్లింగ్‌లో ఎంతోమంది సామాన్యులు మరణించారు. డజన్ల మంది గాయపడ్డారు. కుటుంబాలు చిన్నాభిన్నమై తమ ఇండ్లను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో బతకడమే ప్రథమ ప్రాధాన్యం ఎవరికైనా. ఆహారం.. ఆశ్రయం.. ఔషధాల గురించే ఎవరైనా ఆలోచిస్తారు. ఏదో ఒక రకంగా వాటిని అందించాలనే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. రుతుస్రావ శుభ్రత వంటి ప్రాథమిక అవసరం నిశ్శబ్దంగా విస్మరించబడుతుంది. దానిని ఎవరూ పెద్దగా లెక్క చేయరు. వాస్తవానికి ఆపదలో ఇదెవరికీ గుర్తుకు రాదు. గుర్తుకొచ్చినా "అదంత అవసరమా ఇప్పుడు.?" అని బయటకు చెప్పరు.
ప్యాడ్ స్క్వాడ్
"పూంచ్"లో ఏర్పడిన అత్యవసర సమయంలో "ప్యాడ్ స్క్వాడ్","ఫ్యాబ్ ప్యాడ్" అనే రెండు సంస్థలు "టుగెదర్ ఫర్ పూంచ్" ప్రచారంతో ఒక మూమెంటును స్టార్ట్ చేశారు. ఈ ప్రచారంతో పూంచ్‌లోని 5,000 మంది మహిళలకు స్థిరమైన.. సురక్షితమైన.. గౌరవప్రదమైన "రుతుస్రావ సంరక్షణ" అందిస్తున్నారు. "ప్యాడ్ స్క్వాడ్" ముంబై, పూణెలో పనిచేసే స్వచ్చంద సంస్థ 2020 నుంచి సమాజంలో "రుతుస్రావ శుభ్రత" గురించి పనిచేస్తోంది. 30 నగరాలలో 70 మంది స్వచ్ఛంద సేవకులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వరదలతో సతమతమవుతున్న అసోం.. బెంగాల్ నుంచి గిరిజన బెల్ట్.. పట్టణ బస్తీల వరకు 20 లక్షల రుతుస్రావ శుభ్రత ఉత్పత్తులను పంపిణీ చేశారు.
ఫ్యాబ్ ప్యాడ్
కోల్‌కతా ఆధారిత స్వచ్చంద సంస్థ ఇది. రుతుస్రావ శుభ్రత బ్రాండింగ్ చేస్తుంది. చాలా తక్కువ ధరకు.. పునర్వినియోగ "ప్యాడ్"లను తయారుచేస్తుంది. ఆర్థికంగా వెనకబడిన మహిళకు జీవనోపాధిని ఇస్తుంది. 2020 నుంచి దేశంలో 20,000 మంది మహిళలకు అవగాహన కార్యక్రమాలు.. సమాజ సేవ ద్వారా సహాయం చేస్తోంది. ఉత్పత్తి.. పంపిణి.. విద్య వంటి రంగాల్లో మహిళళకు ఆదాయమార్గాన్ని అందిస్తోంది. పూంచ్‌లో ప్రజలు తమ ఇండ్లు విడిచి వెళ్తుంటే "ఫ్యాబ్ ప్యాడ్" ఆలోచింది. సోషల్ మీడియాలో పూంచ్ కుటుంబాలకు సహాయం చేస్తున్నవారిని చూసి.. తామూ ఏదో ఒకటి చేయాలని ముందుకొచ్చారు "ఫ్యాబ్ ప్యాడ్" నిర్వహకులు.
ప్రతీ ప్యాడ్ ముఖ్యం
రుతుస్రావ శుభ్రతే లక్ష్యంగా "ప్యాడ్ స్క్వాడ్".. "ఫ్యాబ్ ప్యాడ్" కలిసి "టుగెదర్ ఫర్ పూంచ్" అనే కార్యక్రమాన్ని 19 మే 2025న ప్రారంభించాయి. "ప్రతీ ప్యాడ్ ముఖ్యం" అనే సందేశంతో చేపట్టిన "క్యాంపెయిన్" ఇది. దీంట్లో భాగంగా ప్రజల నుంచి సహాయాన్ని కోరుతున్నారు. వాళ్లిచ్చే సహాయంతో "టుగెదర్ ఫర్ పూంచ్"కు సాయం చేస్తారు. ప్రజలు ఎక్కడి నుంచైనా సాయం చేయవచ్చు. దీంట్లో భాగంగా సుమారు 5,000 మంది మహిళలకు సాయం చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. కేవలం రూ.245తో ఒక మహిళకు సాయం చేయవచ్చన్నమాట. ఈ స్పెషల్ డ్రైవ్ లక్ష్యం రూ. 12,25,000/-.
మీరూ స్పందించండి
మనం చేసే రూ.245తో ఒక మహిళకు "కిట్" అందిస్తారు. ఈ కిట్‌లో 3 సాధారణ పునర్వినియోగ "క్లాత్ ప్యాడ్స్", 1 రాత్రి ఉపయోగం కోసం "మాక్సీ ప్యాడ్", 1 ట్రావెల్/వాష్ బ్యాగ్, 1 సూచనల పుస్తకం ఉంటాయి. ఈ కిట్లు "ఫ్యాబ్‌ప్యాడ్" ద్వారా కోల్ కతా నుంచి నేరుగా "పూంచ్"కు కొరియర్ చేస్తారు. అక్కడ "ప్యాడ్ స్క్వాడ్" వాలటీర్స్ వీటిని పంపిణీ చేస్తారు. ఈమెయిల్ ద్వారా అయితే [email protected], ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అయితే @fabpad.in, @padsquad ద్వారా సాయం చేయవచ్చు. ఈ ప్యాడ్స్ నాలుగు సంవత్సరాలు లేదా 100 ఉతకడాల వరకు పునర్వినియోగం చేయవచ్చు.






