Viral Video: అబ్బా.. ఈ ఆటోడ్రైవర్‌ తెలివి మాములగా లేదుగా.. ఆటోలో ఏసీని మించిన చల్లదనం.. నువ్వు సూపర్ అంకూల్

by Vennela |

Viral Video: ఎండాకాలంలో ప్రయాణం అంటే సవాల్ తో కూడుకున్నది.

Viral Video: అబ్బా.. ఈ ఆటోడ్రైవర్‌ తెలివి మాములగా లేదుగా.. ఆటోలో ఏసీని మించిన చల్లదనం.. నువ్వు సూపర్ అంకూల్
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ఎండాకాలంలో ప్రయాణం అంటే సవాల్ తో కూడుకున్నది. ఎందుకంటే ఉదయం 10 దాటిదంటే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. బస్సులు, కార్లలో వెళ్లిన వడగాలి ఇబ్బంది పెడుతుంది. ఇక ఆటో అయితే మరి ఎక్కువ సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుంది. అయితే తన ఆటోలో ప్రయాణించేవారికి ఎండ వేడిమి నుంచి బయటపడేందుకు ఓ ఆటో డ్రైవర్ చేసిన ఈ పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అవును తన ఆటోలో పచ్చటి పూల మొక్కలను అలంకరించి అందులో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆటో నడుపుతున్నారు.

ఆటో పై ఇన్ఫాప్లేట్లను అమర్పించి అందులో మట్టిపూసి గడ్డి, పూల మొక్కలను ఉంచాడు. ఆటో చుట్టూ పెద్ద మొక్కలను ఉంచాడు. ఎండాకాలంలో ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందిపడుతుండటంతో ఈ మొక్కలను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఆటోపై మొక్కలు పెంచుతూ..ప్రయాణికులకు ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగిస్తున్న ఈ ఆటో డ్రైవర్ కు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఆటో టాప్ పై పచ్చని మొక్కలు ఉండటంతో లోపల కూర్చొన్న ప్రయాణికులు ఎంతో చల్లదనంతో తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఇక నెటిజన్లు మాత్రం రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు..మీరు సూపర్ బాబాయ్ ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అంటూ నెటిజన్ కామెంట్ చేయగా..ఒక ఆటో అన్న ఉన్నంత happy గా ఎవ్వరూ లేరహే!! అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే ఈ ఆటో అంకూల్ ఊరు ఎక్కడా అనేది మాత్రం తెలియలేదు.


Next Story