Viral Video: చచ్చినోడు లేచినిల్చోవడం ఏంట్రా.. మీరూ మీ వెర్రి కాకపోతేనూ..!

by Vennela |
Viral Video: చచ్చినోడు లేచినిల్చోవడం ఏంట్రా.. మీరూ మీ వెర్రి కాకపోతేనూ..!
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు చేసే విచిత్ర ప్రయోగాలు ..పిచ్చి, పిచ్చి పనులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తాయి. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని ఎలాగైనా నెట్టింట ఫేమస్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో కొందరు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చనిపోయిన వ్యక్తిని కొందరు ప్రార్థనలు చేసి..ఆ వ్యక్తి లేచి నిలబడేలా చేయడం. ఇదంతా నమ్మశక్యంగా లేదు కదా. అవును ఓ వర్గానికి చెందిన వారు ఏవేవో ప్రార్థనలు చేసి శవపేటికలో ఉన్న శవానికి ప్రాణం పోసి పైకి లేపుతారు.ఇదంతా ప్రజలను వెర్రివాళ్లను చేయడం తప్పా మరోటి కాదనే చెప్పవచ్చు.

నిజంగా ఇప్పటి వరకు మోసాలు చేసి డబ్బు సంపాదించడం చూశాము.. కానీ ఇదే మరోలెవల్ అని ఇప్పుడే తెలిసింది.. ఇది నేషనల్ కాదురా అయ్యా.. ఇంటర్నేషనల్ అని.. మీకు దండం రా నాయనా..ఇలాంటి మోసాలతో ప్రజలను మభ్యపెట్టకండి.. వారి అమాయకత్వంతో ఆడుకోకండి అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

నోట్ : నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఆధారంగానే ఈ కథనం రాయడం జరిగింది. ఏ వర్గాన్ని ఉద్దేశించి రాయలేదన్న విషయాన్ని గమనించగలరు.





Next Story

Most Viewed