- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: మెట్రోలో మందు, ముక్క.. వైరల్ అవుతున్న వీడియో
Viral Video: పబ్లిక్ ప్లేసుల్లో రోజురోజుకూ అలజడులు పెరుగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: పబ్లిక్ ప్లేసుల్లో రోజురోజుకూ అలజడులు పెరుగుతున్నాయి. కొందరు రీల్స్ చేస్తూ..మరికొందరు సెల్పీలు, వీడియోలు తీసుకుంటూ రచ్చ రచ్చ చేస్తుంటే మరికొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు తరుచుగా ఎదురవుతున్నాయి. తాజాగా మరో ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువకుడు మెట్రోలో కూర్చుండి మద్యం తాగుతూ..కోడి గుడ్డు తింటున్న వీడియో ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది.
అసలేం జరిగిందంటే మెట్రోలో తన సీట్లో కూర్చొన్న ఓ యువకుడు బ్యాగులో నుంచి గ్లాసు తీసి అందులో మద్యం పోశాడు. ఆ తర్వాత అదే బ్యాగులో నుంచి బాయిల్డ్ ఎగ్ తీశాడు. గుడ్డు షెల్స్ తీసి కవర్లో వేసి మందు తాగుతూ గుడ్డు తింటున్నాడు. ఆ యువకుడికి ముందు సీట్లో కూర్చొన్న వ్యక్తులు ఈ వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో వైరల్ అవుతున్న ఈ వీడియో @thakurbjpdelhi ID నుండి షేర్ చేశారు. ఈ వీడియోను దాదాపు 3 లక్షల మంది వీక్షించారు. చాలా మంది నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. 'ఢిల్లీ మెట్రోలో చూడటానికి మిగిలి ఉన్నది ఇదే' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
दिल्ली मेट्रो में बस यही देखना बाक़ी रह गया था pic.twitter.com/7G3kPEWf30
— Sandeep Thakur (@thakurbjpdelhi) April 6, 2025
'ఈ వీడియోలో తప్పేంటి?' ఎవరైనా వివరించగలరా? అతను ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా మందు, ఉడికించిన గుడ్డు తిన్నాడు.ఎటువంటి గందరగోళం సృష్టించలేదా? దీనిపై ప్రజలు ఎందుకు కోపంగా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు?' 'ఏదైనా సరే, ఆ వ్యక్తికి శుభ్రత గురించి చాలా అవగాహన ఉంది.. నేలపై పడిన తొక్కలను కూడా తీసుకొని బ్యాగ్‌లో పెట్టాడు.. మీరు ఎప్పుడైనా మద్యం దుకాణానికి వెళ్లారా. ప్రజలు ఎలా లైన్‌లో నిలబడతారు.. ఎవరూ లైన్ దాటరు.. ఇదే దేశ ఆర్థిక వ్యవస్థను నడుపుతుంది' అని మరో యూజర్ రాశాడు. మొత్తానికి ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.






