- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video : వర్షం పడి ఆగిపోయింది.. అంతలో ఓ చిన్నారి రోడ్డుపై వెళ్తుండగా..!!
Viral video : వర్షం పడి ఆగిపోయింది.. అంతలో ఓ చిన్నారి రోడ్డుపై వెళ్తుండగా..!!

దిశ, ఫీచర్స్ : కొన్ని సంఘటనలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. మరికొన్ని వింతైన అనుభూతికి లోను చేస్తుంటాయి. ఇంకొన్ని ఏదో ఒక సడెన్ రియాక్షన్‌కు దారితీస్తుంటాయి. మనలో దాగి ఉన్న బాల్య స్మృతులనో, గత జ్ఞాపకాలనో తట్టిలేపుతుంటాయి. అలాంటి అద్భుతమైన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ క్యూరియాసిటీ తెప్పిస్తోంది. ఇంతకీ అదేమిటి? ఏం జరిగిందనే కదా మీ సందేహం లెట్స్ గో అండ్ రీడ్ దిస్!!
వైరల్ సమాచారం ప్రకారం.. అక్కడి పరిస్థితి చూస్తుంటే కొన్ని క్షణాల ముందు వర్షం పడి ఆగిపోయింది. రోడ్లపై గుంతల్లో నీళ్లు నిలిచాయి. భూమిపైన పరచుకొన్నట్లు ఉండే పచ్చటి గరికపై నీటి తుంపరలు ఇంకా ఆరనే లేదు. ఇదిలా ఉండగానే.. మరోవైపు తాను రావడానికి సిద్ధం అన్నట్లు వర్షం వచ్చే సూచనలు సైతం కనిపిస్తున్నాయి. ఆకాశమంతా మేఘావృతమై ఉంది. ఓ వైపు నీలి మేఘాలు, మరోవైపు నిర్మలమైన ఆకాశం కనువిందు చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. అక్కడ రోడ్డు, రోడ్డు పక్కన ఓ పెద్ద చెట్టు, చెట్టు పక్కనే ఓ నీటిగుంట కనిపిస్తున్నాయి. అంతలో ఓ చిన్నారి రోడ్డుపై నడుచుకుంటూ వచ్చింది. చూడ్డానికి ఎంతో ముద్దుగా, క్యూట్‌గా కనిపిస్తోంది. అలా వచ్చిన ఆ పాప వర్షానికి రోడ్డు పక్కన గుంతలో నిలిచిన నీటిలో దిగి ఎంచక్కా ఆడుకుంటోంది. ఆ నీటిని చేతులతో నెడుతూ.. ఆనందంతో కేరింతలు కొడుతూ మస్తు ఎంజాయ్ చేస్తోంది. ఇది చూస్తే ఎవరికైనా తమ బాల్యం గుర్తొకొస్తుంది. అంత అద్భుతమైన సన్నివేశమది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆలస్యమెందుకు, మీరూ ఓ చూసేయండి మరి!






