- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral News: ఓ అమ్మాయి 3 సెకన్లలో మూడు దేశాలకు ప్రయాణించింది.. అబద్ధం కాదు.. పూర్తిగా నిజం..!
Viral News: ఎవరైనా 3 సెకన్లలో 3 దేశాలకు ప్రయాణించగలరా? ఇదేలా సాధ్యం అనిపించవచ్చు.

దిశ, వెబ్ డెస్క్: Viral News: ఎవరైనా 3 సెకన్లలో 3 దేశాలకు ప్రయాణించగలరా? ఇదేలా సాధ్యం అనిపించవచ్చు. ఎవరైనా ఇలా చేసే ఉంటే అది అసంభవం అంటారు. కానీ మీరు ఈ వీడియో చూసినప్పుడు..మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టేయడం చూసి షాక్ అవుతారు.
మనలో చాలా మందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉంటుంది. అలాంటి వ్యక్తులు దేశంలోనే కాదు ప్రపంచ దేశాలను చుట్టుముట్టేస్తుంటారు. దేశంలో ఏ ప్రాంతానికి..ఏ మూలకు వెళ్లినా పాస్ పోర్ట్ అవసరం ఉండదు. కానీ దేశం దాటి విదేశాలకు వెళ్లాలనుకుంటా పాస్ పోర్టు, వీసా వరకు ప్రతిదీ అవసరం. చాలా దేశాల్లో వీసా అన్ అరైవల్ సౌకర్యం ఉంది. ఇది ప్రయాణాన్ని కొంచెం సౌకర్యవంతంగా చేస్తుంది. కానీ చాలా దేశాలలో ముందుగా వీసా పర్మిట్ పొందాలి. అయితే ఒకేసారి మూడు దేశాలను సందర్శించాలనుకుంటే డాక్యుమెంటేషన్ కు చాలా సమయం పడుతుంది. కానీ ఇప్పుడు మనం చూసే వీడియోలో ఒక అమ్మాయి కేవలం 3 సెకన్లలో 3 దేశాలను చుట్టేసింది. ఇది మీకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ వీడియో చూస్తే మాత్రం షాక్ అవుతారు.
కానీ ముందుగా అందరికీ వచ్చే ప్రశ్న..ఇదేలా సాధ్యం అని. ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సమ్రంగి సాధు జిలిక్. వీడియోను షేర్ చేస్తూ సమ్రంగి ఆచెన్ నగరానికి సమీపంలో ఉన్న మూడు దేశాల పాయింట్ అని రాసి ఉంది. ఈ వీడియోలో సమరంగి మూడుదేశాలను కలిపే సరిహద్దు ప్రదేశంలో ఉంది. ఆ దేశాలు జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం. ఆమె మూడు సెకన్లలో మూడు దేశాల సరిహద్దులను చుట్టేసింది. అందులో సగం జర్మనీ, సగం నెదర్లాండ్, మిగతా బెల్జియం ఆక్రమించాయి. ఇక్కడి నుంచి మూడు దేశాలకు మూడు దిశలలో వెళ్లవచ్చు. ఇప్పుడు సమరంగి షేర్ చేసిన ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 6లక్షలకు పైగా వీక్షించారు. వేలాది మంది ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేశారు.
ఓ వినియోగదారుడు ఇక్కడికి రైలులో వెళ్లవచ్చా అని కామెంట్ చేస్తే..మీరు నాకు లొకేషన్ పంపగలరా అని అడిగారు. మూడు దేశాల స్థానాన్ని ఉపయోగించి గర్భిణీ స్త్రీ బిడ్డకు జన్మనిస్తే... ఆ బిడ్డ జాతీయత ఏమిటి మరో నెటిజన్ కామెంట్ చేశారు.






