- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాములతో సహజీవనం... ఇంటింటికీ ప్రత్యేక బెడ్రూం
పాములను చూస్తే ఎవరైనా అంతదూరం పరుగెడతాం. భయంతో దాక్కుంటాం. కానీ ఆ గ్రామంలో పాములను దైవంగా భావిస్తారు.

దిశ, వెబ్డెస్క్: పాములను చూస్తే ఎవరైనా అంతదూరం పరుగెడతాం. భయంతో దాక్కుంటాం. కానీ ఆ గ్రామంలో పాములను దైవంగా భావిస్తారు. వారితో సహ సహజీవనం చేయడానికి సకల సౌకర్యాలు కల్పిస్తారు. సమాజానికి భిన్నంగా ఉన్న ఈ గ్రామం మహారాష్ట్రలో ఉన్నది.
షెట్పాల్ గ్రామ ప్రజలు పాములను దైవంగా పూజిస్తారు. పూర్వికుల కాలం నుంచి ఆ గ్రామ ప్రజలు పాములను తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తారు. ఇంట్లోనూ వాటి నివాసానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించి, అవి సాఫీగా తిరిగేందుకు సకల ఏర్పాట్లు చేస్తారు. వాటికీ ఆహారాన్ని అందిస్తారు. ఆ గ్రామంలో ఎక్కడ చూసినా పాములు వీధుల్లో తిరుగుతూ కనిపిస్తాయి. పిల్లలు సైతం వాటితో ఆడుకుంటూ.. పరుగెడుతూ కనిపిస్తారు. అయినా ఏ ఒక్క పాము ఆ గ్రామస్తులను కాటేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. వీటిల్లో అత్యంత విషపూరితమైన నాగుపాములు, కొబ్రాలు కూడా ఉండటం విశేషం. మహారాష్ట్ర ప్రజలు ఈ గ్రామాన్ని పాముల దేశంగా పిలుస్తారు. వినడానికి వింతగా, ఆశ్చర్యంగా ఉన్న ఈ గ్రామం నిజంగా అద్భుతమే కదా.






