Viral News: ఒకే ముహుర్తానికి ఇద్దరిని పెళ్లిచేసుకున్న యువకుడు..ఈ వీడియో చూస్తే ఎవడ్రా ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ అనాల్సిందే

by Vennela |   (  Updated:2025-04-25 08:22:14  IST  )

Viral News: ఓ వైపు 30 సంవత్సరాలు దాటిపోయిన 40 సంవత్సరాలు దగ్గర పడుతున్న ఒక పెళ్లి కూడా కాకుండా బ్రహ్మచారులుగా మిగిలిపోతున్న ఈ కాలంలో, ఒకే ముహూర్తానికి ఒకే మండపంలో ఇద్దరు యువతులతో యువకుడు పెళ్లి చేసుకున్న ఘటన కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లో చోటు చేసుకుంది.

Viral News: ఒకే ముహుర్తానికి ఇద్దరిని పెళ్లిచేసుకున్న యువకుడు..ఈ వీడియో చూస్తే ఎవడ్రా  ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ అనాల్సిందే
X

దిశ, వెబ్ డెస్క్: Viral News: ఓ వైపు 30 సంవత్సరాలు దాటిపోయిన 40 సంవత్సరాలు దగ్గర పడుతున్న ఒక పెళ్లి కూడా కాకుండా బ్రహ్మచారులుగా మిగిలిపోతున్న ఈ కాలంలో, ఒకే ముహూర్తానికి ఒకే మండపంలో ఇద్దరు యువతులతో యువకుడు పెళ్లి చేసుకున్న ఘటన కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన అడ్డసర గ్రామానికి చెందిన ఆత్రం చత్రుషావ్ జీవితంలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. ఒకే మండపంలో ఇద్దరితో పెళ్లి చేసుకున్న యువకుడి ఘటన వివరాల్లోకి వెళితే ..

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డెసర గ్రామానికి చెందిన ఆత్రం చత్రుషావ్ గత నాలుగేళ్లుగా తన గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. అయితే ఏడాదిగా కెరమెరి మండలం సాంగి గ్రామానికి చెందిన మరో యువతిని కూడా ప్రేమిస్తున్నాడు. ఇటీవల ఆమెతో పెళ్లి చూపులు పూర్తయ్యాయి. ఈ విషయం మొదటి యువతికి తెలిసి పెద్ద గొడవ అయింది. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ పెద్దలను న్యాయం చేయమని రాయి సెంటర్‌కు వెళ్లి న్యాయం కోరింది. దీంతో రెండు కుటుంబాల పెద్దలతో పాటు గ్రామ పెద్దలు కూడా సమావేశమై పరిష్కారం కోసం చర్చలు జరిపారు.

అయితే యువకుడు చత్రుషావ్ తో వివాహం చేసుకునేందుకు ఇద్దరు యువతులు సమ్మతి తెలిపారు దీంతో యువకుడితో ఇద్దరు యువతులను ఇచ్చి వివాహం జరిపేందుకు వారి కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందం జరిగింది. అయితే విచిత్రంగా ఇద్దరినీ ఒకేరోజు ఒకే ముహూర్తానికి యువకుడు పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు ఇందుకోసం ప్రత్యేకంగా వరుడి పేరు వధువు పేర్లతో కూడిన పెళ్లి పత్రిక తెగ వైరల్ అయింది. ఎందుకంటే సాధారణంగా భర్త మరో యువతితో తన జీవితాన్ని పంచుకుంటాను అంటే మేస్త్రీ కూడా అంత తేలికగా ఒప్పుకోదు.

చాలా సందర్భాల్లో ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకొని వేరుకాపురాల్లో కాపురం చేస్తూ మధ్యలో పట్టుబడి తన్నులు తినే ప్రబుద్ధులు చాలామంది ఉంటారు. మరి అలాంటి ఈ కాలంలో ఇంత గొప్ప అండర్ స్టాండింగ్ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఇద్దరి యువతులను ఎలా ఒప్పించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు… ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అని మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.

Next Story