- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: ఈ అమ్మాయికి తాగడానికి నోరు కాదు.. మూతి కింద మరొకటి ఉంది.. ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాక్ పక్కా బాస్!
Viral Video: వెర్రి వెయ్యి తలలు వేస్తుంది అనడానికి ఈ వీడియోను మనం ఒక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: వెర్రి వెయ్యి తలలు వేస్తుంది అనడానికి ఈ వీడియోను మనం ఒక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో టాటూ అలాగే పీర్సింగ్ అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఫ్యాషన్ అనేది పరిమితంగా ఉంటే బాగుంటుంది. కానీ అది మితిమీరి పోతేనే ప్రమాదాలకు దారితీస్తుంది. ఈ మధ్యకాలంలో పీర్సింగ్ అనేది ఒక ఫ్యాషన్ అయినప్పటికీ శరీరంలో ఏ భాగంలో పడితే ఆ భాగంలో ఇలా కన్నాలు చేసుకోవడం అనేది ఎంతో ప్రమాదకరమైన వైద్యులు సైతం చెబుతున్నారు.
అయినప్పటికీ యువత ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తమను తాము సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకంగా చూపించుకోవడానికి ఎలాంటి పనులు చేయడానికి అయినా తెగబడి పోతున్నారు. తాజాగా ఈ వీడియోలో చూస్తున్న అమ్మాయి తన పెదవి కింద ఒక ఖండం చేయించుకుంది. ఇది ఎంతో ప్రమాదకరమైన ప్రక్రియ అయినప్పటికీ. ఈ కన్నం గుండా ఆమె స్ట్రా ద్వారా జూస్ తాగుతున్నట్టు గమనించవచ్చు.
భగవంతుడిచ్చిన నోరు ఉండగా ఆ నోటి కింద మరో ఖండం పెట్టుకోలేని ఆలోచన ఆ యువతికి ఎందుకు వచ్చిందో ఏమిటో తెలియదు కానీ. ఇది చూసిన నెటిజెన్స్ మాత్రం వెర్రికి హద్దు అదుపు లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ అమ్మాయి ముఖమంతా టాటూస్ చేయించుకుంది. నిజానికి టాటూస్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులు సైతం వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అయినప్పటికీ యువత పట్టించుకోని పరిస్థితుల్లో ఉంది. అసలు ఈ టాటూస్ పైత్యం ఏంటో, ఈ పీర్సింగ్ వెర్రి ఏంటో అర్థం కాక జనం తలపట్టుకుంటున్నారు. కానీ ఈ సోషల్ ఇన్ ఫ్లూయెన్సర్లు మాత్రం వైరల్ అవ్వడానికి ఏం చేయడానికైనా సిద్ధం అనే రీతిలో తయారవుతున్నారు. ఇందుకోసం ఏమాత్రం వెనుకాడటం లేదు. ప్రాణాలకు సైతం తెగించి మరి వైరల్ అయ్యేందుకు సిద్ధపడి పోతున్నారు. మరి ఈ సోషల్ మీడియా వైరల్ పైత్యం పరిష్కారం ఏంటో భవిష్యత్తు ఎలా అల్చాల్సి ఉంది. అప్పటివరకు ఇలాంటివి చూసి ఔరా అనుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు.






