Viral Video: టిక్కెట్టుకొని రైలు ఎక్కి నరకానికి వెళ్లిపోవచ్చు... ఎక్కడో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా

by Vennela |   (  Updated:2025-04-25 06:05:23  IST  )

Viral Video: మన పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఆర్థిక పరిస్థితుల్లో ప్రపంచానికి మొత్తం తెలిసిందే.

Viral Video: టిక్కెట్టుకొని రైలు ఎక్కి నరకానికి వెళ్లిపోవచ్చు... ఎక్కడో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: మన పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఆర్థిక పరిస్థితుల్లో ప్రపంచానికి మొత్తం తెలిసిందే. అక్కడ అస్థిరమైన రాజకీయాల కారణంగా ఇప్పటికే ఆ దేశం పేదరికంలో కూరుకు పోతోంది. అయితే బంగ్లాదేశ్ అనగానే మనందరికీ గుర్తు వచ్చేది అక్కడి రైల్లో వ్యవస్థ చాలాసార్లు అక్కడ రైళ్ల దుస్థితిని ఫోటోలు తీసి ఇంటర్నేషనల్ మ్యాగజైన్లు వెబ్ సైట్లు సైతం ప్రచురిస్తుంటాయి.

రైళ్ల మీదకి ఎక్కి తమ గమ్యస్థానాలకు చేరుకునే వీడియోలు ఫోటోలు బంగ్లాదేశ్ లో కోకోల్లలు. అయితే కొన్నిసార్లు ఈ రైళ్లను చూపించి భారతీయ రైల్వే లను కొంతమంది నెటిజన్లు విమర్శిస్తుంటారు. అయితే ఇవి భారతీయ రైలు కావు బంగ్లాదేశ్ రైల్వే వ్యవస్థ దుస్థితి అని గుర్తించాలి.ఎందుకంటే అక్కడ ఆర్థిక పరిస్థితి దిగజారిన నేపథ్యంలో రైల్వే వ్యవస్థకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆ దేశ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది.

దీంతో పెరుగుతున్న జనాభాకు సరిపడా రైళ్లను రైల్వే వ్యవస్థను వాళ్ళు పెంపొందించలేకపోయారు. ఫలితంగా రైలు లోపల సీట్లకు సరిపోక రైలు మీదికు ఎక్కి మరీ కూర్చుంటారు. అయితే మన దేశంలో దాదాపు రైల్వే లైన్లు అన్నీ కూడా ఎలక్ట్రిక్ వ్యవస్థలోకి మారిపోయాయి. రైల్వే లైను పైన ఎలక్ట్రిక్ తీగ ఉంటుంది కనుక మన దేశంలో రైలు మీదకు ఎక్కి ప్రయాణం చేయడం అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. ఎందుకంటే ఎలక్ట్రిక్ తీగలు ఉన్న కారణంగా ఎవరైనా రైలుపై కప్పు మీదికి ఎక్కినట్లయితే కరెంటు షాక్ కొట్టిన కాకి లాగా మాడిపోవడం ఖాయం. కనుక ఇలాంటి దుస్థితి భారతీయ రైల్వేలకు పట్టలేదని చెప్పవచ్చు.

మన పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ రైల్వే వ్యవస్థలు అత్యంత దారుణంగా ఉంటాయి. గతంలో పాకిస్తాన్లో కూడా చూసాము, ఏకంగా రైలును అక్కడి ఉగ్రవాదులు హైజాక్ చేసి ఎత్తుకు వెళ్ళిపోయారు. ఈ లెక్కన మన భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే గా చక్కటి సేవలను అందిస్తుందని మనం భావించవచ్చు. ఓవైపు మన దేశం వందే భారత్ ఎక్స్ .ప్రెస్, త్వరలోనే పరుగులు పెట్టబోతున్న బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులతో దూసుకెళ్తుంటే, పొరుగున ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ మాత్రం రాతియుగంలోకి అడుగులు పెడుతున్నాయి.



Next Story