Viral Video: వీడి తెలివి తగలెయ్య.. ఈఎంఐలో సిగరెట్ అమ్ముతున్న టీకొట్టు బిజినెస్ మ్యాన్.. బంపర్ ఆఫరే?

by Vennela |
Viral Video: వీడి తెలివి తగలెయ్య.. ఈఎంఐలో సిగరెట్ అమ్ముతున్న టీకొట్టు బిజినెస్ మ్యాన్.. బంపర్ ఆఫరే?
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: అగ్గిపుల్ల సిగరెట్ పీక కాదేది సోషల్ మీడియాకు అనర్హం అన్నట్టు తయారయింది పరిస్థితి. కంటెంట్ క్రియేటర్లు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రాంక్, ఫన్నీ వీడియోలు చేసేవారు తమ క్రియేటివిటీని ఆకాశాన్ని తాకిస్తున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇందులో యువకుడు ఈఎంఐ రూపంలో సిగరెట్లను అమ్ముతున్నానని వీడియో చేశాడు. ఈ వీడియో తెగ వైరల్ అయింది.

ప్రస్తుతం మార్కెట్లో మొబైల్ ఫోన్ మొదలు ఇల్లు, కారు, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్ని వస్తువులు ఈఎంఐ రూపంలో విక్రయిస్తున్నారు. దీనికి వడ్డీల మీద వడ్డీలు వేసి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. అటు కస్టమర్లు సైతం ఈఎంఐ అనగానే ఎగురుకుంటూ వెళ్లి కొనేస్తున్నారు. కానీ నెల నెల వాయిదాలు కడుతున్నప్పుడు మాత్రం కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.దీన్నే బేస్ చేసుకొని ఈ యువకుడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో చక్కటి కామెడీ స్కిట్ రూపొందించాడు.

ఇందులో యువకుడు సిగరెట్ చేసేందుకు 80 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడని. అతనికి నాలుగు రూపాయల డౌన్ పేమెంట్ మీద సిగరెట్ అందిస్తున్నాడని నెలకి ఒక రూపాయి చొప్పున ఈఎంఐ చెల్లిస్తాడని, సిగరెట్ కొన్నందుకు ఫ్రీ గిఫ్ట్ గా ఒక వక్కపొడి ప్యాకెట్ కూడా ఇస్తున్నట్లు వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఉన్న ఈఎంఐ వ్యవస్థ మీద ఇది ఒక విమర్శనాత్మక విడియో గా చెప్పవచ్చు కానీ నెటిజన్లకు మాత్రం ఇది నవ్వు తెప్పిస్తోంది. కంటెంట్ క్రియేటర్ల క్రియేటివిటీని చూసి ఔరా అంటున్నారు.





Next Story

Most Viewed