- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Viral Video: ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు...వన్ సైడ్ లవ్ లో ఆర్యను మించి మించిపోయాడు...

దిశ, వెబ్ డెస్క్: Viral Video: సోషల్ మీడియాలో రోజుకు ఒక వీడియో వైరల్ అవుతుంది. కొన్ని వీడియోలకు అర్థాలు ఉండవు కేవలం ఫన్నీ మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న వీడియోలో ఒక కుర్రాడు, రోడ్డు మీద ఉన్న ఒక పోస్టర్ పైన ఉన్నటువంటి అమ్మాయిని వన్ సైడ్ లవ్ చేసి ఆ అమ్మాయిని ఎంత బాగా ప్రేమిస్తున్నాడో చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వైరల్ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
కొంతమంది ఇలాంటి వీడియోలు చూసి నాన్సెన్సీ పనికొచ్చే పనులు చేయొచ్చు కదా అని అంటూ ఉంటే, కంటెంట్ క్రియేటర్లు మాత్రం మేము ఎన్ని పనికి వచ్చే పనులు చేసినా మీరు చూడరు కదా ఇలాంటి పనులు చేస్తేనే చూస్తారు కదా అని కౌంటర్లు ఇస్తున్నారు. అవును నిజమే సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు చూసేవారికన్నా చెత్త వీడియోలు చూసేవారే ఎక్కువగా ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు తామరతంపరలా వచ్చి పడుతున్నాయి.
ప్రస్తుతం అలాంటి వీడియోనే ఇక్కడ మనం చూడవచ్చు. ఆర్య సినిమాలో అల్లు అర్జున్ ఫీల్ మై లవ్ అంటూ వన్ సైడ్ లవ్ ఎలా చేయాలో చూపించాడు. కానీ ఈ తమ్ముడు రెండాకులు ఎక్కువగా చదివి రోడ్డు మీద కనిపించే పోస్టర్ల మీద ఉన్న అమ్మాయిలను సైతం ఇలా ఫీల్ మై లవ్ అంటూ వన్ సైడ్ లవ్ ప్రేమించేస్తున్నాడు. మనోడు ప్రేమిస్తున్న సంగతి వారికి ఎలాగో తెలియదు కనీసం ఇలాగైనా సంతృప్తి పొందుతున్నాడు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అమ్మాయిల వెంటపడి వేధించడం కన్నా ఇలా ప్రేమించుకోవడం ఉత్తమం అని మరికొందరు సలహా ఇస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో అయితే తెగ వైరల్ అయిపోయింది మీరు కూడా ఒక లుక్ వేసేయండి.