Viral Video: ఈ కాకి ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంది.. అంతేకాదు మీరు మర్చిపోయిన దారిని కూడా చూపిస్తుంది.. వైరల్‌ వీడియో!.

by Vennela |

Viral Video: ఈ కాకి ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంది.. అంతేకాదు మీరు మర్చిపోయిన దారిని కూడా చూపిస్తుంది.. వైరల్‌ వీడియో!.
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ఎప్పుడైనా ఒక చిలక పలికితే చిలక పలుకులు ఎంత బాగున్నాయి అని మనం అంటూ ఉంటాము. అదే సమయంలో కాకి అరిస్తే ఛీ కాకి గోల అని ఒక రాయి విసిరి దాన్ని తరమాలని చూస్తాము. ఎందుకంటే కాకులు చేసే గోల అలాంటిది. కాకి చేసే గోల అలాంటిది. కానీ ఇక్కడ చూస్తున్న వైరల్ వీడియోలో ఓ కాకి చక్కగా మాట్లాడుతోంది. అది కూడా ఇంగ్లీషులో మాట్లాడుతోంది.

విదేశాల్లో ఉన్న ఈ కాకి ఇంగ్లీషు పలుకులు పలకడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా పక్షులు చిన్నచిన్న పలుకులను రిపీట్ చేస్తుంటాయి. ముఖ్యంగా చిలకలు, మైనా, గోరింక లాంటి కొన్ని పక్షులు మనుషులు మాట్లాడే మాటలను చిన్నగా రిపీట్ చేస్తూ ఉంటాయి. ఇవి వినడానికి ఎంతో ఆశ్చర్యంగాను మనకు ఆనందదాయకంగానూ కల్పిస్తుంటాయి.

అయితే తాజాగా చూస్తున్న వైరల్ వీడియోలో మాత్రం ఒక కాకి ఇలా మాట్లాడటం చాలా అరుదైన విషయం అని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే పక్షుల్లో అందులోనూ ప్రత్యేకంగా కాకుల్లో సహజ సిద్ధంగానే వాటికి కొన్ని తెలివితేటలు ఉంటాయని, అవి ఇతర కాకులతో మాట్లాడుకునే కమ్యూనికేషన్ చాలా అడ్వాన్స్ గా ఉంటుందని, జంతు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.

మరోవైపు పర్యావరణంలో వస్తున్న మార్పులు పక్షుల పాలిట శాపంగా మారుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ వాడటం వల్ల పక్షులకు చాలా ఇబ్బందికరంగా మారుతుందని, ముఖ్యంగా అవి రేడియేషన్ కారణంగా వాటి మెదడు దెబ్బతింటుందని తద్వారా అవి చనిపోయే ప్రమాదం ఉందని, జంతుశాస్త్ర ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

మొత్తానికి ప్రకృతిలో ఇలాంటి అరుదైన వింత విశేషాలు ఎన్నో ఉన్నాయి. మనిషికి వెతికే కొద్దీ ప్రకృతి ప్రతిరోజు ప్రతిక్షణం ఒక ఆశ్చర్యాన్ని అందిస్తుంది. ఎందుకంటే మనిషికి ప్రతిక్షణం ఒక కొత్త అనుభవం ఇచ్చేందుకు ఈ ప్రకృతి ఎప్పటికీ సిద్ధంగా ఉంటుంది అన్న సంగతి మర్చిపోవద్దు.



Next Story