- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది కదా కొడుకు చేయాల్సింది.. అమ్మ కిడ్నీ ఇస్తే మనోడు చరిత్ర సృష్టించాడు.!
తన కొడుక్కి కిడ్నీ దానం చేసి అతడినొక ఛాంపియన్‌గా నిలబెట్టింది

దిశ, ఫీచర్స్: వరుణ్ ఆనంద్.. 15 ఏళ్ల వయసులో క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతూ క్రీడలలో తన అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు. అతను ఆ స్థాయికి రావడానికి కారణం తన తల్లి. అందరిలా అల్లారుముద్దుగా చూసుకోవడమే కాదు.. తన కొడుక్కి కిడ్నీ దానం చేసి అతడినొక ఛాంపియన్‌గా నిలబెట్టింది.
తల్లి ఆందోళన
వరుణ్ ఆనంద్ తన తల్లి దీపా ఇచ్చిన కిడ్నీతో 2023లో పెర్త్‌లో జరిగిన వరల్డ్ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్‌లో మూడు బంగారు పతకాలను సాధించాడు. ఈ విజయం అతని జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. చిన్నతనంలో ఫుట్‌బాల్ మైదానం నుంచి బయటకు రావడానికి ఇష్టపడని వరుణ్ తన తొమ్మిదవ ఏట “నీరసంగా ఉంది, ఆడాలనిపించడం లేదు” అని చెప్పాడు. ఈ మార్పు అతని తల్లిదండ్రులకు ఆందోళన కలిగించింది. రోజులు గడిచేకొద్దీ వరుణ్ తన ఉత్సాహవంతమైన బాల్యాన్ని నిరుత్సాహ పరిచింది. దీనిని తాత్కాలిక సమస్యగా భావించినప్పటికీ.. అత్యవసర వైద్య సంరక్షణకు తీసుకెళ్లాల్సి వచ్చింది.
కొడుకు కోసం..
తొమ్మిదేళ్ల వయసులో వరుణ్ హీమోడయాలసిస్‌పై ఉండాల్సిన పరిస్థితి. కొడుకు పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయింది ఆ తల్లి. అదృష్టవశాత్తు తన తల్లి దీపా ఇచ్చిన మూత్రపిండం అతడికి సరిగ్గా సరిపోయింది. అవయవ మార్పిడి తన జీవితాన్ని ఎలా మారుస్తుందో.. తాను మళ్లీ క్రీడలలో పాల్గొనగలనా అనే ఆందోళన వరుణ్‌కు ఉండేది. కానీ 2023లో పెర్త్‌లో జరిగిన వరల్డ్ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్‌లో 12-14 ఏళ్ల వయసు విభాగంలో టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, టెన్నిస్‌లో మూడు బంగారు పతకాలు సాధించాడు. “నాకు ఇంత సామర్థ్యం ఉందని నేనెప్పుడూ అనుకోలేదు” అని అంటాడు వరుణ్.
సత్తా చాటాలి
ప్రస్తుతం జర్మనీలోని డ్రెస్డెన్‌లోజరుగుతున్న 25వ వరల్డ్ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్‌లో 51 దేశాల నుంచి అథ్లెట్లు 17 విభిన్న క్రీడలలో పోటీపడుతున్నారు. 1978 నుంచి జరుగుతున్న ఈ గేమ్స్‌లో నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న, హృదయం, పేగు, మూత్రపిండం, కాలేయం, ఊపిరితిత్తులు, క్లోమం లేదా ఎముక మజ్జ మార్పిడి చేయించుకున్న వారు పాల్గొనవచ్చు. కనీసం ఒక సంవత్సరం ముందు మార్పిడి చేయించుకొని స్థిరమైన అవయవ పనితీరుతో వైద్యపరంగా సిద్ధంగా ఉండాలి. ఈ పోటీలో సత్తా చాటాలనేది వరుణ్ లక్ష్యం.
కొత్త జీవితం
వరల్డ్ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్‌కు సిద్ధమవుతూ వరుణ్ వారంలో మూడు గంటలు, వారాంతాల్లో ఏడు గంటలు శిక్షణ తీసుకున్నాడు. “నా తల్లిదండ్రులు ఆటల్లో ఆనందించమని, గెలవడానికి ప్రయత్నించమని చెప్పారు. కానీ మొదటి బంగారు పతకం సాధించినప్పుడు నేను నిజంగా ఏదో సాధించానని అర్థమైంది. నా తల్లి నాకు కిడ్నీ దానం చేసి దేశం కోసం గొప్పగా ఏదో చేయడానికి నాకు సహాయపడింది” అని వరుణ్ భావోద్వేగంతో చెప్పాడు. అతడికి అవయవ మార్పిడి కొత్త అధ్యాయం లాంటిది. పాత పుస్తకాన్ని మూసివేసి కొత్త పుస్తకాన్ని రాయడానికి ఈ మార్పిడి సహాయపడింది.






