Valentine's Special: మనసులో ఒకడు.. మంచం మీద మరొకరు.. ఇదే నేటి లవ్/లస్ట్ థియరీ

by Sujitha Rachapalli |   (  Updated:2025-02-13 13:29:34  IST  )

వాలెంటైన్స్ డే కదా... అందరిలో ప్రేమ పొంగిపోతుంది. గిఫ్ట్ కార్డ్స్, బహుమతులు, చాక్లెట్స్, కేక్ కట్టింగ్స్.. అంటూ లవర్‌ను శాటిస్‌ఫై చేసేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. టీనేజర్స్ అయితే

Valentines Special: మనసులో ఒకడు.. మంచం మీద మరొకరు.. ఇదే నేటి లవ్/లస్ట్ థియరీ
X

దిశ, ఫీచర్స్ : వాలెంటైన్స్ డే కదా... అందరిలో ప్రేమ పొంగిపోతుంది. గిఫ్ట్ కార్డ్స్, బహుమతులు, చాక్లెట్స్, కేక్ కట్టింగ్స్.. అంటూ లవర్‌ను శాటిస్‌ఫై చేసేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. టీనేజర్స్ అయితే అమ్మనాన్న డబ్బులతో.. అడల్ట్స్ అయితే తాము సంపాదించిన పైసలు కూడబెట్టి మరి సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇదెంత వరకు పవిత్ర ప్రేమ.. అసలు ఈ రోజుల్లో ప్యూర్ లవ్ ఉందా? అనే విషయం గురించి ఆలోచిస్తున్న నాకు.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కంట పడింది. దాన్ని చూడగానే ఓ సినిమాలో చెప్పినట్లుగా ఒక్క సెకన్‌లో నా జ్ఞాన బల్బు వెలిగినట్లు అనిపించింది. ఇంతకీ పోస్టు అర్థం ఏంటంటే.. ‘‘మనసులో ఒకరు.. మంచం మీద మరొకరు’’.. అవును కదా ఈ రోజుల్లో ప్రేమలు ఇలాగే ఉన్నాయనిపించింది. ముఖ్యంగా ఈ మధ్య క్రైమ్ స్టోరీస్ చూసుకుంటే ఇదే నిజమనిపిస్తుంది.

ఏ క్రైమ్ స్టోరీ చూసుకున్న అ‘‘క్రమ’’బంధాలే ఆయువును తీశాయి. లవర్స్ అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో గొడవలు జరిగి.. సారీ సారీ లస్ట్ స్టోరీలో ఘర్షణ జరిగి మర్డర్‌కు దారితీస్తే.. ఇంకొన్ని కథల్లో ఫ్యామిలీ ఉన్నా సరే పక్కన ఓ లవర్ ఉంటే ఎంటర్‌టైన్మెంట్ ఉంటదనుకుని.. అదేనండి ఇల్లీగల్ రిలేషన్‌లో మజా ఉంటుందని కమిట్ అయ్యారు. చివరకు అసలు స్టోరీ తెలియడంతో జరిగిన గొడవలు కాస్తా హత్య, ఆత్మహత్యకు కారణమయ్యాయి. ఈ క్రైమ్ స్టోరీస్‌లో బలి అయింది ఎవరో తెలుసా... ఒక్కరినే నమ్ముకుని తనే నా ప్రాణం అనుకున్న భాగస్వామి మాత్రమే. కథ బయటకు వచ్చే వరకు సుఖపడింది ఎవరు అంటే సీక్రెట్ రిలేషన్ పెట్టుకుని... గుండె ఒకరిది.. గది మరొకరిది.. అనే నినాదంతో బతికిన అ‘‘క్రమ’’ బుద్ధి కలవారిదే. ఈ స్టోరీస్ చూశాక అర్థమైన అసలు విషయం ఏంటంటే.. లవ్ బికమ్స్ లస్ట్ నావ్.. ప్రేమ అనేది అంత అబద్ధం.. మోహం అనేదే నిజం.

అందుకే ఒక సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లుగా.. ‘ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడం.. లేక ప్రాణాలు తీయడం నేరం.. క్షమించరాని నేరం’ అనే థియరీని ఫాలో అయ్యి.. కెరీర్ మీద ఫోకస్ పెడితే అందరి జీవితాలు బావుంటాయని కొందరు పెద్దలు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.

నోట్.. సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా రాసిన కథ

Next Story