- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాలెంటైన్స్ వీక్ : అబ్బాయిలూ.. మీలో ఈ లక్షణాలుంటే అమ్మాయిలు పడిపోయినట్లే..
సాధారణంగా అబ్బాయిలు.. అమ్మాయిలను ఆకర్షించేందుకు సవాలక్ష ప్రయత్నాలు చేస్తారు. కానీ ఒక్కోసారి వారు అనుకున్నది సాధించలేరు. అమ్మాయిలు తమవైపు తిరిగి కూడా చూడరు. కానీ చాణక్య నీతి ప్రకారం మీలో ఉండే కొన్ని లక్షణాలే

దిశ, ఫీచర్స్ : సాధారణంగా అబ్బాయిలు.. అమ్మాయిలను ఆకర్షించేందుకు సవాలక్ష ప్రయత్నాలు చేస్తారు. కానీ ఒక్కోసారి వారు అనుకున్నది సాధించలేరు. అమ్మాయిలు తమవైపు తిరిగి కూడా చూడరు. కానీ చాణక్య నీతి ప్రకారం మీలో ఉండే కొన్ని లక్షణాలే... అమ్మాయిలను ఫిదా అయ్యేలా చేస్తాయి. అతిగా ప్రయత్నించడం ఆపి.. అవేంటో ముందుగా తెలుసుకుంటే.. ఫలితం ఉండొచ్చు. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం.
* నిజాయితీగా ఉండే పురుషులను అమ్మాయిలు ఇష్టపడుతారు. ముఖ్యంగా స్త్రీల పట్ల గౌరవం కలిగి ఉంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు.
* ముక్కుసూటి స్వభావం ఫిదా చేసేస్తుంది. అందం కంటే మంచి మనసు, వ్యక్తిత్వానికే ప్రయారిటీ ఇస్తారు. ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నా, ఎంత మెయింటెన్ చేసినా వేస్ట్ ఆఫ్ టైమ్ అన్నమాటే.
* ఎదుటి వ్యక్తి చెప్తుంటే బాగా విని, అర్థం చేసుకునే పురుషులను మహిళలు లైక్ చేస్తారు. ఇలాంటి వారు కొంచెం ఫ్రెండ్లీగా ఉన్న తొందరలోనే దగ్గరైపోతారు. వారి గుణాలకు మంత్రముగ్దులవుతారు.
* ఇక ఫ్యామిలీ కోసం కష్టపడి పనిచేస్తూ.. వారి సంతోషం కోసం త్యాగం చేసే పురుషులను వివాహం చేసుకునేందుకు మొగ్గుచూపుతారు. కానీ పెళ్లి తర్వాత మారే అవకాశం కూడా ఉండొచ్చు. తమతో ఎక్కువ సమయం గడపట్లేదని గొడవలు స్టార్ట్ కావొచ్చు.
* ఇక కుటుంబం కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టేవారిని మహిళలు ఇష్టపడుతారు. కానీ భవిష్యత్తులో ఇది బిగ్ మిస్టేక్ కావొచ్చు.
* తమ గురించి అతిగా ఆలోచించే పార్ట్‌నర్ కావాలని కోరుకుంటారు స్త్రీలు. కానీ ఇది ఫ్యూచర్‌లో పర్సనల్ స్పేస్ లేకుండా చేస్తుంది. కలహాలకు దారితీస్తుంది.






