- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Valentine's Day: చాక్లెట్ డే ప్రత్యేకత.. చాక్లెట్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?

దిశ, వెబ్ డెస్క్: చాక్లెట్ డే (ఫిబ్రవరి 9).. ప్రేమికులు వాలంటైన్ వీక్‌లో భాగంగా మూడవ రోజు జరుపుకుంటారు. ఈరోజు తమకు ప్రేమకు గుర్తుగా ఒకరికొకరు చాక్లెట్లను బహుమతిగా ఇచ్చుకుంటారు. ఇక చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాక్లెట్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. నేడు చాక్లెట్ డే సందర్భంగా మీకోసం ఈ ప్రత్యేక కథనం.
చాక్లెట్ డే చరిత్ర
చాక్లెట్లకు 5000 ఏండ్ల చరిత్ర ఉంది. పూర్వం ప్రజలు దీనిని ఒక పానీయంగా తీసుకునేవారు. పలు రోగాలకు ఔషదంగా కూడా వినియోగించేవారు. 16వ శతాబ్దంలో లాటిన్ అమెరికాలోని యూరప్, ఆఫ్రికాకు చెందిన వలసవాదులచే చాక్లెట్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇక 1840 సంవత్సరం నుంచి వాలెంటైన్స్ వీక్ వేడుకల్లో చాక్లెట్ డే అంతర్భాగం అయినట్లు సమాచారం. ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమకు ఇష్టమైన వారికి, తమ భాగస్వాములకు ఈ చాక్లెట్లను అందజేస్తారు. చాక్లెట్ తినడం వల్ల సెరోటోనిన్ , డోపమైన్ అనే సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా ఆనందాన్ని అందిస్తాయి. అందుకే ప్రేమికులు తమ ప్రేమ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఈ డే జరుపుకుంటారు.
చాక్లెట్లలో ఎన్ని రకాలు ఉన్నాయంటే?
డార్క్ చాక్లెట్: ఇది రుచిపరంగా చేదుగా ఉంటుంది. కానీ, ఆరోగ్యపరంగా చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్ తినటం వల్ల మెదడులో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలై మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది. రక్తపోటును నియత్రిస్తుంది. అయితే, డార్క్ చాక్లెట్స్ రోజూ తినడం మంచిది కాదు.
మిల్క్ చాక్లెట్: దీని రుచి యమ్మీగా క్రీమీగా ఉండటంతో చాలా మంది ఈ చాక్లెట్లను అత్యంత ఇష్టపడతారు. ఇందులో కోకో ఘనపదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇందులో పాల పొడి, చక్కెర, లెసిథిన్ అనే మూలకాలు ఉంటాయి. ఇందులో డార్క్ చాక్లెట్ కంటే కాల్షియం కాస్తా అధికంగానే ఉంటుంది.
వైట్ చాక్లెట్: ఇందులో లీన్ కోకో ఘనపదార్థాలు ఉండవు. దీనికి సాంప్రదాయ చాక్లెట్ రంగు, రుచి కూడా ఉండదు. నిజానికి, ఈ చాక్లెట్ కోకో గింజల నుంచి తయారైన కోకో వెన్న కన్నా భిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. అందులోనూ ఈ వైట్ చాక్లెట్ రుచి క్రీమీగా, చాలా మృదువుగా ఉంటుంది. అయితే, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించటంతో సహాయపడుతాయి. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.
అయితే ఏ చాక్లెట్‌ను కూడా నిత్యం తీసుకోవటం ఆరోగ్యానికి మంచింది కాదు.