Baldness : ఆ చెట్టు ఆకులను ఇలా వాడితే చాలు.. 12 వారాల్లో బట్టతల మాయం..!

by Javid Pasha |   (  Updated:2025-08-19 09:54:05  IST  )

మోరింగా సీడ్ ఆయిల్‌లోని ఫైటో స్టెరాల్ సమ్మేళనాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయయి. పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

Baldness : ఆ చెట్టు ఆకులను ఇలా వాడితే చాలు.. 12 వారాల్లో బట్టతల మాయం..!
X

దిశ, ఫీచర్స్ : బట్టతల సమస్యతో బాధపడుతున్నారా..? అయితే పెద్దగా ఖర్చులేని ఒక అద్భుతమైన పరిష్కారం ఉందంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. ఏంటంటే.. మోరింగా ఒలిఫెరా(Moringa oleifera)ను వాడటం. అంటే ఈ చెట్టు ఆకులను, కాయలను ఆహారంగానో, సప్లిమెంట్లుగానో, సీరమ్ లేదా నూనె రూపంలోనో వాడటంవల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. రాలినచోట తిరిగి వెంట్రుకలు మొలిచే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ మునగ చెట్టును ‘మిరాకిల్ ట్రీ’ అని కూడా పిలుస్తారు.

జుట్ట రాలడాన్ని నివారించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో మునగ ఆకులు, విత్తనాలు, కాండం సహాయపడతాయి. ముఖ్యంగా మోరింగా సీడ్ ఆయిల్‌లోని ఫైటో స్టెరాల్ సమ్మేళనాలు (Beta-sitosterol, campesterol, ergosterol) డీటీహెచ్(DHT ) ఏర్పడటాన్ని అడ్డుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయని, పెరుగుదలను ప్రోత్సహిస్తాయని ‘ఫార్మకోగ్నసీ జర్నల్‌’ గత అధ్యయనం కూడా నిరూపించింది. మోరింగాలోని జింక్, ఐరన్ వంటి ఖనిజాలు జుట్టు కుదుళ్లను బాగు చేసి, తలలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తాయి.

మోరింగాలోని విటమిన్ ఎ సెబమ్ ఉత్పత్తిని నియంత్రించి తల మాడ భాగాన్ని తేమగా ఉంచుతుంది. అలాగే విటమిన్లు సి, ఇ ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా మోరింగాలో సిస్టీన్, మెథియోనిన్ వంటి అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు కారణమయ్యే కెరాటిన్ ప్రోటీన్ ఉత్పత్తిలో కీ రోల్ పోషిస్తాయి. కాబట్టి సుమారు 12 వారాలు నిరంతరం మోరింగాను ఆహారంగానో, సప్లిమెంట్లుగానో, నూనె రూపంలోనో వాడితే బట్టతల తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. Link

Next Story