- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Miracle medicine : మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం.. ఈ పువ్వు కనిపిస్తే అస్సలు వదలకండి!
Miracle medicine : మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం.. ఈ పువ్వు కనిపిస్తే అస్సలు వదలకండి!

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందించగల ఆహారాల్లో మాంసాహారం, ఆకు కూరలు, కాయ గూరలే కాదు, కొన్ని రకాల పువ్వులు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో అరటి పువ్వు (Banana Flower) కూడా ఒకటి. ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లకు డైట్‌లో భాగంగా ఈ పువ్వును తీసుకుంటే చాలామంచిది. ఇంతకీ ఏ విధమైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
*బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి : అరటి పువ్వులో ఉండే ఫైబర్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. దీని వల్ల రక్తంలో గ్లూకోస్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులోని ఫైబర్ కంటెంట్ కార్బోహైడ్రేట్ల(carbohydrates) శోషణ(absorption)ను నెమ్మదింపజేస్తుంది. దీంతో మధుమేహ బాధితులకు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా అరటి పువ్వును కషాయంగా (Decoction) తీసుకోవడం వల్ల కూడా డయాబెటిస్‌ను నియంత్రించవచ్చని ఆయుర్వేదిక్ నిపుణులు సూచిస్తున్నారు.
*యాంటీ ఆక్సిడెంట్లకు మూలం : అరటి పువ్వులో విటమిన్ C, విటమిన్ A, ఇతర యాంటీ-ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడి(Oxidative stress)ని తగ్గిస్తాయి. డయాబెటిస్ బాధితులలో ఇది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అరటి పువ్వును ఆహారంగా తీసుకుంటే ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
* మెగ్నీషియం, ఇన్సులిన్ సెన్సిటివిటీ: అరటి పువ్వులో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది, ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. కాబట్టి శరీరంలో గ్లూకోజ్‌ను సమర్థవంతంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ నియంత్రణకు సహాయపడుతుంది. దీంతోపాటు ఇందులోని విటమిన్ B6 సహా ఇతర విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మెగ్నీషియం కంటెంట్ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక అరటి పువ్వులో ఉండే ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ నాడీవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. అయితే ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి అరటి పువ్వును ఆహారంగా ఉపయోగించే విషయమై ముందుగా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






