అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా?.. అయితే చిన్న ప్లేట్‌లో తినండి!

by Disha Web Desk 6 |
అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా?.. అయితే చిన్న ప్లేట్‌లో తినండి!
X

దిశ, ఫీచర్స్: మీరు అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే భోజన సమయంలో ఉపయోగించే ప్లేట్ చిన్నగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇది మీ అధిక బరువు సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుందని సర్టిఫైడ్ న్యూట్రిషియనిస్ట్ డాక్టర్ రోహిణీ పాటిల్ చెప్తున్నారు. ప్లేట్ చిన్నగా ఉన్నప్పుడు సహజంగానే మీరు సర్వ్ చేసుకోగలిగే ఆహారాన్ని అది పరిమితం చేస్తుంది. దాని భౌతిక పరిమితి, అంతర్నిర్మిత భాగం కంట్రోలింగ్ టూల్‌గా పనిచేస్తుంది. ఫలితంగా మీరు ఆహారం మితంగా తీసుకోవడాన్ని ఈ పరిస్థితి సులభతరం చేస్తుంది.

తినడానికి చిన్న ప్లేట్‌ని ఉపయోగించినప్పుడు, అదే మొత్తంలో ఆహారం ప్లేట్‌లోని ఉపరితల వైశాల్యంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది. ఈ భాగం దాని కంటే పెద్దదిగా ఉన్నట్లు భావించేలా మీలో మెంటల్ విజువలైజ్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. ఫలితంగా మెదడు కూడా అది గణనీయమైన భోజనంగా అంగీకరిస్తుంది. ఇది సంతృప్తి, సంపూర్ణత భావాలకు దారి తీస్తుంది. మీ భోజనాన్ని పెద్దదిగా భావించడం ద్వారా, తక్కువ మొత్తంలో ఆహారంతో మీ మనసు సంతృప్తి చెందే అవకాశం ఉంది. ఫైనల్‌గా మీ బరువు తగ్గించే ప్రయత్నాలకు ఇది దోహదం చేస్తుంది.

మైండ్ ఫుల్ ఈటింగ్

ఎప్పుడైతే మీరు తినడానికి చిన్న ప్లేట్‌ని ఎంచుకుంటారో అప్పుడు మరింత జాగ్రత్తగా తినేలా ప్రేరేపించబడతారు. ప్లేట్‌లోని అన్నం కానీ, ఇతర ఏ ఆహారం అయినా సరే, తక్కువ ప్లేస్‌లో నిండుగా కనిపించడం మూలంగా అది కింద పడిపోతుందేమోనని జాగ్రత్తగా తింటారు. తినే వేగం కూడా తగ్గుతుంది. అంతేగాక మీరు ఆహారం యొక్క రుచిని ఆస్వాదిస్తూ తినడంవల్ల మైండ్ ఫుల్‌ నెస్ ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఎక్కువ సంతృప్తిని ప్రోత్సహిస్తుంది. పరిమితం ఆహారంతో పాటు ఆరోగ్యానికి అవసరమైన ఆనందం మీ సొంతం అవుతుంది.

కేలరీల తగ్గింపు

చిన్న ప్లేట్‌ను ఉపయోగించడంవల్ల మీరు తీసుకునే కేలరీల పరిమాణం కూడా తగ్గుతుంది. సహజంగానే తినే ఫుడ్ కంటెంట్ తగ్గడం అనేది కేలరీల వినియోగంలో తగ్గుదలకు దోహదం చేస్తుందని ఆహార నిపుణులు చెప్తున్నారు. కాలక్రమేణా ఈ కేలరీల తగ్గింపు బరువు తగ్గడానికి లేదా సరైన బరువు నిర్వహణకు దోహదపడుతుంది.

మానసిక సంతృప్తి

చిన్న ప్లేట్‌లో తినడం అనేది మానసిక సంతృప్తిని అందిస్తుంది. తక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్నప్పటికీ, ఫుల్‌ ప్లేట్ విజువల్ పర్సెప్షన్(visual perception )అనేది మెదడును సంతృప్తిపరిచేలా చేస్తుంది. మీరు తక్కువగా తింటున్నామనే మానసిక కోణాన్ని అధిగమించడంలో ఇది సహాయపడుతుంది. చిన్న ప్లే‌ట్‌లో నిండైన భోజనం కనిపించడం కూడా మీలో సంతృప్తికి, సానుకూల మనస్తత్వానికి దోహదపడుతుంది. మీ బరువు తగ్గించే లక్ష్యాలకు కట్టుబడి ఉండటంలో సహాయపడుతుంది.

Read More: మగవారు ఈ ఆరు విషయాలలో ఆడవాళ్లను ఎప్పటికీ అర్థం చేసుకోరంట?

Read More: ఈవినింగ్ టైంలో టీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

Next Story

Most Viewed