- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UPSC Success Story: మోడల్ కాదు..యూపీఎస్సీ టాపర్...ఆమె అందాన్ని చూస్తే మీరు కుళ్ళుకోవడం ఖాయం
UPSC Success Story: భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైనటువంటి యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి.

దిశ, వెబ్ స్టోరీ: UPSC Success Story: భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైనటువంటి యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యేందుకు లక్షలాది మంది యువత సంవత్సరాల తరబడి కష్టపడుతుంటారు. ఇందుకోసం వారు తమ కాలాన్ని శ్రమను డబ్బును ఖర్చు చేస్తుంటారు. అయినప్పటికీ కొద్దిపాటి మార్కులతో లక్షలాది మందికి యూపీఎస్సీ సీటు చేజారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో కాంపిటీషన్ అత్యధికంగా ఉంటుంది. ఎందుకంటే దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వెంట్ ఉద్యోగుల నియామకం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. యూపీఎస్‌సీ పరీక్ష మూడు దశల్లో జరుగుతుంది – ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రతి ఏడాది లక్షల మంది ప్రయత్నించినా, చివరకు ఇందులో విజయం సాధించేది కేవలం 0.2% మంది మాత్రమే కావడం గమనార్హం.
అయితే 2024 సంవత్సరం సంబంధించి యూపీఎస్సీ పరీక్ష ఫలితాలు అధికారికంగా విడుదలవ్వగా ఇందులో మొత్తం 1009 మంది ఉత్తీర్ణులు అయ్యారు. వీరిలో 725 మంది పురుషులు 254 మంది మహిళలు ఉన్నారు. వీరంతా IAS, IPS, IFS, ఇతర కేంద్ర గ్రూప్ A, B సేవల కోసం ఎంపికయ్యారు.
యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విజయ గాథ ఉంటుంది. వీరిలో ఎంతోమంది స్ఫూర్తిదాయకమైన వారు కూడా ఉంటారు. చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు చాలామంది ఈ ఫలితాల్లో తారసపడుతుంటారు. ప్రస్తుతం పూర్వా చౌదరి అనే ఓ యువ యూపీఎస్ఈ ఉత్తీర్ణురాలి గురించి తెలుసుకుందాం. ఆమె ఆల్ ఇండియా స్థాయిలో 533వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ఆమె విజయాన్ని ఆమె సోదరి నవ్యా సహరాన్ ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా పంచుకుంది. ఈ వీడియోలో పూర్వా యూపీఎస్‌సీ భవనం ముందు తీసిన ఫోటోతో సహా ఆమె జీవితంలోని ఎన్నో మధురకమైన ఘట్టాలను ఈ రీల్ లో చూపించారు. ఈ వీడియోకి 20 లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం.
ఇక ఈ వీడియో క్యాప్షన్ కింద "Sibling goals? అని రాశారు. అందులో ఇలా ఉంది ఒకరు దేశంలోని కఠినమైన పరీక్షను పాస్ చేసింది, ఇంకొకరు ఈ క్యాప్షన్ రాస్తోంది!" అని సరదాగా రాశారు. పూర్వా సాధించిన విజయం ఎంతో ప్రేరణాత్మకం. ఈ విజయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది.






