- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుకు అండగా.. ఫసల్ క్రాంతి.!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రైతాంగ సమస్యలు పరిష్కరించే స్టార్టప్ ఇది

దిశ, ఫీచర్స్: టెక్నాలజీ చాలా పెరుగుతోంది. వ్యవసాయంలో కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. "ఫసల్ క్రాంతి" స్టార్టప్ అలాంటి ఆవిష్కరణే. రైతులు ఎదుర్కొంటున్న విపరీత ఖర్చులు.. వనరుల దుర్వినియోగం వంటి సమస్యల పరిష్కారం కోసం దీనిని రూపొందించారు యూపీకి చెందిన శైలేంద్ర తివారీ.. ఆనంద్ వర్మ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రైతాంగ సమస్యలు పరిష్కరించే స్టార్టప్ ఇది.
ఉద్యోగాలు వదిలేసి..
శైలేంద్ర తివారీ.. ఆనంద వర్మ ఇద్దరూ కార్పొరేట్ ఎంప్లాయిస్. రైతాంగ సమస్య సమస్యల పరిష్కారం కోసం 2017లో తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఫసల్ క్రాంతి అనే ప్లగ్-అండ్-ప్లే డివైస్ ద్వారా రైతులకు డేటా ఆధారిత సలహాలు ఇస్తూ ఖర్చులు తగ్గించి.. దిగుబడులు పెంచుతున్నారు. ఇప్పటికే 52 బిలియన్ లీటర్ల నీటిని ఆదా చేసిన ఫసల్ క్రాంతి రోజురోజుకూ రైతులకు దగ్గరవుతోంది. ఫసల్ క్రాంతి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మట్టి ఆర్ద్రత.. తేమ.. ఉష్ణోగ్రత.. ఆకుల తడి వంటివి పరిశీలిస్తూ వ్యాధులు.. నీటి పారుదల.. పంటల ప్రణాళికకు సలహాలు ఇస్తోంది.
5 లక్షల ఎకరాలకు..
"ఫసల్ క్రాంతి" స్టార్టప్‌ను ఛత్తీస్‌గఢ్.. కర్ణాటక.. మహారాష్ట్ర.. మధ్యప్రదేశ్‌లో సుమారు 10వేల ఎకరాల్లో అమలుచేశారు. దీనివల్ల పురుగుల మందుల ఖర్చు 60% తగ్గింది. దిగుబడులు 40% పెరిగాయి. ముఖ్యంగా 52 బిలియన్ లీటర్ల నీటిని ఆదా చేసింది. పంటలకు నీళ్లు ఎప్పుడు పారుదల చేయాలి.. మందులు ఎప్పుడు వేయాలి అనే డేటా ఆధారంగా తెలుస్తుంది. ఫసల్ క్రాంతి రూ.100 కోట్లు ఫండింగ్ సేకరించింది. టీడీకే వెంచర్స్.. బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ నుంచి సపోర్ట్ లభిస్తోంది. దీనితో 75 వేల ఎకరాల నుంచి 5 లక్షల ఎకరాలకు ఫసల్ క్రాంతి సేవలను విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు.
సాగు విధానంలో మార్పు..
ఫసల్ క్రాంతి సౌర శక్తితో పని చేస్తుంది. సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌లతో ఇది కనెక్ట్ అవుతుంది. ఫసల్ యాప్ ద్వారా తెలుగు.. హిందీ వంటి స్థానిక భాషల్లో సలహాలు వస్తాయి. దేశంలో ఎక్కడైనా దీనిని వాడొచ్చు. రైతులు అమర్చిన డివైస్ ఆధారంగా నీళ్లు పారబెట్టాలా వద్దా.? మందులు ఏ రోజు వేయాలి వంటి అలర్ట్‌లు వస్తాయి. దీంతో ఫసల్ క్రాంతి వ్యవసాయాన్ని మార్చివేస్తోంది. సమర్థవంతమైన పంటల వైపు రైతును అడుగులు వేయిస్తోంది. వికసిత భారత్ లక్ష్యానికి దోహదపడుతూ రైతుల ఆర్థిక బలోపేతానికి దారితీస్తోంది. ఫసల్ ఫ్రెష్ అనే కొత్త విభాగంతో పంటలు నేరుగా మార్కెట్‌కు తీసుకెళ్లే సౌకర్యం కూడా ఉంది.






