అత్త.. కోడలు.. ఓ కిచెన్.!

by Daayi Srishailam |

అలాంటి వారికి ఓ అవకాశం కల్పిస్తోంది "అత్తమ్మాస్ కిచెన్".

అత్త.. కోడలు.. ఓ కిచెన్.!
X

వంటల టాపిక్ వస్తే..

మొదటగా వినిపించే పదం "అమ్మచేతి వంట".

బిజీ జీవితాల్లో పడి..

అమ్మచేతి వంట రుచి చూస్తున్నామా.?

అలాంటి వారికి ఓ అవకాశం కల్పిస్తోంది "అత్తమ్మాస్ కిచెన్".

అదేంటి అమ్మచేతి వంట అని చెప్పి..

"అత్తమ్మాస్ కిచెన్" రుచులు చూపిస్తు్న్నారు అనుకుంటున్నారా.?

అదే ఈ స్టోరీ స్పెషాలిటి.

లెట్స్ ఫాలో.!!

- దిశ, ఫీచర్స్

ఉపాసన కొణిదెల.. జాన్వీ కపూర్‌ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ కిచెన్ కిట్ బాక్స్‌ను జాన్వీకి అందజేసింది ఉపాసన. ఆ బాక్స్ తీసుకొని జాన్వీ మస్తు మురిసిపోయింది. ఇంతకూ ఆ కిచెన్ బాక్సులో ఏమున్నాయో తెలుసుకోవాలంటే ముందు "అత్తమ్మాస్ కిచెన్" గురించి తెలుసుకోవాలి.

సురేఖ ఆలోచన

"అత్తమ్మాస్ కిచెన్" ఉపాసన కామినేని స్టార్ట్ చేసిన స్టార్టప్. చిరంజీవి భార్య సురేఖ కొణిదెల ఆలోచనల్లోంచి ఈ స్టార్టప్ పుట్టింది. సురేఖ పుట్టినరోజు సందర్భంగా దీనిని ప్రారంభించారు. బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు చిరంజీవికి ఇంటి నుంచే భోజనం పంపేవారు సురేఖ. అత్తమ్మ నుంచి స్ఫూర్తి పొందిన ఉపాసన.. సాంప్రదాయ వంటకాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఈకిచెన్‌ను రూపొందించింది. రెడీ టు ఈట్ ఉత్పత్తులు ఇవి. సురేఖ చేతి వంట రుచితో ఆ వంటకాలు ఉంటాయి. ఆధునిక జీవనశైలిలో ఇంటి భోజనం మిస్ అవుతున్న వారికి "అత్తమ్మాస్ కిచెన్" అమ్మచేతి వంట రుచిని చూపిస్తోంది.

బంధాల బలోపేతం

"అత్తమ్మాస్ కిచెన్" ఒక బిజినెస్ స్టార్టప్ మాత్రమే కాదు. ఇదొక కుటుంబ బంధాలను.. సంప్రదాయాలను కాపాడే వేదిక అంటున్నారు సురేఖ.. ఉపాసన. అత్త-కోడలు సహకారంతో ఈ వెంచర్ రూపొందించడం ద్వారా సాంస్కృతిక విలువలను కొత్త తరానికి అందిస్తున్నారు. ఇంటికి.. అమ్మచేతి వంటకు దూరంగా ఎక్కడో ఉండి చదువు.. ఉద్యోగం చేసేవారికి "అత్తమ్మాస్ కిచెన్" ఇంటి రుచిని గుర్తుచేస్తోంది. విదేశాల్లో ఉండేవారికి సైతం డెలివరీ చేస్తున్నారు. ఒకవైపు వ్యాపారం.. మరోవైపు సాంప్రదాయ ఆహారాన్ని సమ్మిళితం చేసి ఒక బంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని దీనిని నడిపిస్తోంది ఉపాసన.

ఆన్‌లైన్ సేవలు

"అపోలో లైఫ్" వైస్ చైర్ పర్సన్‌గా అద్భుతమైన వ్యాపార నైపుణ్యం కలిగివుంది ఉపాసన. ఆ అనుభవంతో స్థిరమైన క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించాలనుకుని అత్తమ్మాస్ కిచెన్‌ను రూపొందించింది. athammaskitchen.com ద్వారా ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి యువ ఆంత్రప్రెన్యూర్‌లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆన్‌లైన్ సేవల ద్వారా దేశంలోనే కాకుండా విదేశీ వినియోగదారులకు సులభంగా సాంప్రదాయ వంటకాలను అందిస్తోంది. ప్రస్తుతం నాలుగు ప్రధాన వంటకాలనే అందిస్తున్నప్పటికీ భవిష్యత్‌లో మరిన్ని ఐటమ్స్ చేర్చి ప్రత్యేకతను చాటుకోవాలనుకుంటోంది.

ఏమేం అందిస్తున్నారు.?

పొంగల్ మిక్స్: ఇదొక మార్నింగ్ టిఫిన్. సౌతిండియా ఫేమస్. త్వరగా చేసుకునే విధంగా రూపొందించిన ఈ సంప్రదాయ వంటకాన్ని ఫస్ట్ ఛాయిస్‌గా అందిస్తున్నారు.

పులిహోర పేస్ట్: ఇన్‌స్టంట్‌గా తయారుచేసే ఫుడ్ లిస్టులో ఫస్ట్ ఉంటుంది పులిహోర. తెలుగు రాష్ట్రాలు.. తమిళనాడులో ఇది చాలా ఫేమస్. అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్ అన్నంలో కలుపుకుంటే పులిహోర క్షణాల్లో రెడీ అవుతుంది.

ఉప్మా మిక్స్: తక్కువ సమయంలో తయారయ్యే ఈ టిఫిన్ రోజువారి జీవితంలో మనకో ఆప్షన్. దీనిని ప్యాక్ రూపంలో అత్తమ్మాస్ కిచెన్ అందిస్తోంది. నిమిషాల్లో ఉప్మా తయారుచేసుకునే అవకాశం కల్పిస్తోంది.

రసం పౌడర్: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే వంటకం రసం. సౌతిండియా ఫేమస్ ఇది. పచ్చిపులుసులా ఉండే ఈ రసాన్ని అత్తమ్మాస్ కిచెన్ అద్భుతమైన టేస్ట్‌తో అందిస్తోంది.

ధర ఎంతంటే.?

పొంగల్ మిక్స్.. పులిహోర పేస్ట్.. ఉప్మా మిక్స్.. రసం పౌడర్ ఒక్కోదాన్ని 700 గ్రాముల ప్యాకెట్లలో అందిస్తున్నారు. ఈ నాలుగు ఉత్పత్తుల కాంబో ధర రూ.1099. రుచిలో.. నాణ్యతలో కాంప్రెమైజ్ కాకుండా లాభాపేక్ష కంటే సాంప్రదాయ వంటకాన్ని పరిచయం చేస్తున్నామనే సంతృప్తి.. బంధాలను బలోపేతం చేస్తున్నామనే సంతోషాన్ని నిర్వహకులు ఆస్వాదిస్తున్నారు.

Next Story