Technology : నీటితో చార్జ్ అయ్యే బ్యాటరీ.. అల్బర్టా శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ!

by Javid Pasha |

నీటితో చార్జ్ అయ్యే సరికొత్త బ్యాటరీని డెవలప్ చేయడం టెక్నాలజీ రంగంలో మరో ముందడుగు అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఇది అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్క్యుట్స్ వంటి ప్రమాదాలను నివారిస్తుంది.

Technology : నీటితో చార్జ్ అయ్యే బ్యాటరీ.. అల్బర్టా శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ!
X

దిశ, ఫీచర్స్ : బ్యాటరీలు ఏవైనా చాలా వరకు విద్యుత్ ఆధారితంగానే పనిచేస్తుంటాయి. అందుకోసం వివిధ రసాయనాలు, పదార్థాలు, సూర్యకాంతి వంటి శక్తి వనరులను ఉపయోగించుకుంటాయి. కానీ అల్బర్టా అండ్ రాయల్ మెల్బోర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (RMIT) యూనివర్సిటీ పరిశోధకులు ఇందుకు భిన్నంగా నీటి చార్జ్ అయ్యే విధంగా, ఆధారితంగా పనిచేసే సరికొత్త బ్యాటరీని డెవలప్ చేశారు. ఇంతకీ అది ఎలా తయారు చేశారు? ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నీటితో చార్జ్ అయ్యే సరికొత్త బ్యాటరీని డెవలప్ చేయడం టెక్నాలజీ రంగంలో మరో ముందడుగు అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఇది అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్క్యుట్స్ వంటి ప్రమాదాలను నివారిస్తుంది. అటువంటి సందర్భాల్లో అందులోని ఫ్లమ్మబుల్ సాల్వెంట్లకు బదులుగా ఆక్వియస్ ఎలక్ట్రోలైట్లను ఉపయోగించుకొని సురక్షితమైన, పర్యావరణ అనుకూలమైన ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలను అందిస్తుంది. అల్బర్టా యూనివర్సిటీలోని కెమికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ విభాగంలోని మెటీరియల్స్ సైంటిస్ట్ జియోలీ వాంగ్ అనే నిపుణులు తన విద్యార్థులతో కలిసి దీనిని అభివృద్ధి చేశాడు.

నిపుణులు కొత్తగా డెవలప్ చేసిన బ్యాటరీ పనితీరు విషయానికి వస్తే దీని లోపల ఎలక్ట్రోలైట్‌గా నీరు + కొంచెం సాల్ట్ మిశ్రమం ఉంటుంది. తయారీ సంరద్భంగానే ఫ్యాక్టరీలోనే సీల్ చేసి పెడతారు. కాబట్టి వివిధ అవసరాలకు ఉపయోగిస్తున్నప్పుడు సహజంగానే ఈ నీటి ఆధారితంగా పనిచేస్తుంది. జస్ట్ సాధారణ లిథియం బ్యాటరీలా చార్జ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ లోపల ద్రవం నీటి ఆధారితమై ఉంటుంది కాబట్టి త్వరగా పాడవదు. హీట్ కూడా అవదు. అగ్ని ప్రమాదాలు బ్యాటరీ పేలడం, మంటలు రావడం వంటివి దాదాపు జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే అల్బార్టా టీమ్ ప్రెజరైజ్డ్ ఆర్గానిక్ ఎలక్ట్రోడ్లను అభివృద్ధి చేసి, ఎనర్జీ, డెన్సిటీ, కెమికల్ రియాక్టివిటీ, ఎలక్ట్రానిక్ కండక్టివిటీ, థర్మల్ స్థిరత్వాన్ని పెంచడం ద్వారా దీనిని డెవలప్ చేసింది. ప్రస్తుతం తొలిదశ ప్రయోగాల్లో ఉన్న ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో బ్యాటరీల వినియోగంలో ప్రమాదాలు చోటు చేసుకోవడం, షార్ట్ సర్క్యూట్స్, బ్యాటరీలు వంటివి కాలిపోవడం, పేలిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం దాదాపు ఉండదని నిపుణులు అంటున్నారు. Link

Next Story