- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక నిత్య యవ్వనమే..! చర్మ వృద్ధాప్యాన్ని అడ్డుకునే టెక్నిక్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు
ఇక నిత్య యవ్వనమే..! చర్మ వృద్ధాప్యాన్ని అడ్డుకునే టెక్నిక్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు

దిశ, ఫీచర్స్ : బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటివి ప్రతీ ఒక్కరిలో సంభవించే సహజమైన దశలు. ఏ వ్యక్తి కూడా వీటికి అతీతం కాదు. కానీ మనిషి ఎంతైనా ఆశావాది కదా.. ఏది కంఫర్ట్‌గా, అట్రాక్ట్‌గా, ఆనందంగా ఉందనిపిస్తే దానికోసం ఆరాట పడుతుంటాడు. వయసు విషయంలోనూ అంతే. బాల్యం, యవ్వనంతో పోలిస్తే వృద్ధాప్యం కష్టంగా ఉంటుంది కాబట్టి, తిరిగి రాదని తెలిసినా కంఫర్ట్ జోన్‌లో ఉండే యవ్వనమే ఎల్లప్పుడూ ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఎవరికైనా. శాస్త్రవేత్తలు సైతం దశాబ్దాల కాలంగా వృద్ధాప్యాన్ని నివారించే అంశంపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా స్కిన్ ఏజింగ్‌ను అడ్డుకునే అద్భుతమైన టెక్నిక్‌ను గుర్తించారు.
యూకేలోని బాబ్రహామ్ ఇన్‌స్టిట్యూట్( Babraham Institute in the UK)కు చెందిన శాస్త్రవేత్తలు మానవ చర్మ కణాల వయసును 30 ఏండ్ల వెనక్కి తీసుకెళ్లే ఒక అద్భుతమైన ఆవిష్కరణకు తెరతీశారు. అందుకోసం వృద్ధాప్యాన్ని అడ్డుకునే ‘పాక్షిక సెల్యులార్ రీప్రోగ్రామింగ్’ (Partial cellular reprogramming) అనే టెక్నిక్‌ను ఉపయోగించారు. యమనక ఫ్యాక్టర్స్ (Yamanaka factors) అనే ప్రోటీన్లను 13 రోజుల పాటు ప్రయోగశాలలో నిర్ణీత సమయంలో ఉపయోగించి 53 ఏండ్ల వయసుగల మానవ చర్మ కణాలను 23 ఏండ్ల వయస్సునకు తిరిగి వచ్చేలా యవ్వనంగా మార్చగలిగారు. ఈ ప్రక్రియలో కణాలు తమ స్వభావాన్ని (Identity) కోల్పోకుండా, జన్యు స్థాయిలో వృద్ధాప్య గడియారాన్ని(aging clock) రీసెట్ చేశారు. ఫలితంగా ఈ కణాలు వేగంగా గాయాలను మాన్పే శక్తిని, ఎక్కువ కొల్లాజన్ ఉత్పత్తిని, శరీరంలో యవ్వన చర్మాని(youthful skin.)కి సంబంధించిన జన్యువులను యాక్టివేట్ చేయడంలో సహాయపడింది.
తాజా పరిశోధనలో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, చర్మ కణాలను వృద్ధాప్య దశకు చేరకుండా అడ్డుకోవడమనే మార్పులు శాశ్వతంగా కొనసాగాయి. వారాల తర్వాత కూడా కణాలు యవ్వన లక్షణాలను కొనసాగించాయి. మైక్రోస్కోప్‌లో కణాల స్ట్రాంగ్ స్ట్రక్చర్, గట్టి సంబంధాలు, మెరుగైన స్థితిస్థాపకత(resilience)ను చూపాయి. దీంతో ఈ సరికొత్త ఆవిష్కరణ రీజనరేటివ్ మెడిసిన్‌లో విప్లవాత్మక మార్పులను తీసుకురావచ్చునని, శరీరంలో వృద్ధాప్య ఛాయలను అడ్డుకోవడంతోపాటు, ఆర్థరైటిస్, అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్సలో అద్భుతాలు చేయవచ్చునని పరిశోధకులు అంటున్నారు. ఈ టెక్నిక్ కేవలం చర్మంలో యవ్వనాన్ని పెంచడమే కాకుండా, శరీర కణ స్థాయిలోనూ నిజంగా యవ్వనాన్ని పునరుద్ధరించే దిశగా ఒక గొప్ప ముందడుగు అంటున్నారు శాస్త్రవేత్తలు. మరిన్ని పరిశోధనల్లో సక్సెస్ అయితే చర్మ వృద్ధాప్యాన్ని అడ్డుకోవడం, మరణం వరకు మనుషులు యవ్వనంగానే కనిపించడం సాధ్యం అవుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.






