- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగాది స్పెషల్ తెలుగింటి వంటకం.. నోరూరించే నేతి బొబ్బట్లు.. తక్కువ సమయంలో ఇలా చేసేయండి!
నూతన సంవత్సరాది మొదటి పండుగైన ఉగాదిని ఈ నెల 19వ తేదీన జరుపుకోనున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: నూతన సంవత్సరాది మొదటి పండుగైన ఉగాదిని ఈ నెల 19వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజు తెలుగింట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఉగాది పండుగ ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. తెలుగువారి పండుగలు ఉగాదితోనే ప్రారంభం అవుతాయి. ఉగాది పండుగ వస్తుందంటే పల్లెల్లో కొత్తదనం, అందరి ఇళ్లల్లో ఆనందకేళి కనువిందు చేస్తుంది. తెలుగు పండుగల్లో ఒక్కటైన ఉగాది ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఉగాది వస్తుంది సంతోషాలను మోసుకొస్తుందంటూ చిన్న పెద్ద సంబురాలు చేసుకుంటారు.
అయితే.. ఉగాది అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆ తర్వాత పంచాంగ శ్రవణం, బొబ్బట్లు. నోరూరించే బొబ్బట్లను ప్రాంతాన్ని బట్టి భక్ష్యాలు, పోలేలు అని కూడా పిలుస్తారు. ఇక, వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. చిన్న పెద్ద ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఇవి చేయడం మాత్రం అంత సులభం కాదు. ఇవి చేయడంలో కొంచెం మెలకువలు కూడా తెలుసుకోవాలి. లేదంటే గట్టిగా రావడం, మధ్యలో విరుగుతుండటం జరుగుతుంటాయి. కాబట్టి.. నోట్లో వేసుకోగానే కరిగిపోయే నేతి బొబ్బట్లు తయారు చేసుకునే విధానం ఇక్కడ తెలుసుకుందాం.
బొబ్బట్లు తయారీకి కావాల్సిన పదార్థాలు..
1.ఒక కప్పు శనగపప్పు
2. పావు కప్పు బెల్లం
3.గోధుమ పిండి లేదా మైదా పిండి పావు కప్పు
4.యాలకుల పొడి వన్ టీ స్పూన్
5.నెయ్యి నాలుగు స్పూన్లు
6.నీళ్లు:పప్పు ఉడికించడానికి తగినంత
7.నూనె: 3 నుండి 4 టేబుల్ స్పూన్లు (పిండి సాఫ్ట్‌గా ఉండాడనికి)
తయారీ విధానం.. బొబ్బట్లు చేసే ముందు సరైన కొలతలు ఉండాలి. ముందుగా శనగ పిండిని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పప్పును ఉడకబెట్టుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత అందులో పావు కప్పు బెల్లం, వన్ టీ స్పూన్ యాలకుల పొడి, వన్ స్పూన్ నెయ్యి వేయాలి. బాగా కలిపి దాదాపు 15 నిమిషాల పాటు లో ప్లేమ్ మంటపై ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ లేదా మైదా పిండిని సిద్ధం చేసుకోవాలి. దీని కోసం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో మైదా పిండి లేదా గోధుమ పిండిని తీసుకోవాలి. తర్వాత అందులో వన్ టీ స్పూన్ నూనే, చిటికెడు ఉప్పు వేసి, కొద్దిగా నీరు పోస్తూ చపాతీ పిండి టైప్‌లో కలుపుకోవాలి.
ఎక్కువ సేపు పిండిని కలుపుతు ఉండాలి. అప్పుడే పిండి సాఫ్ట్ గా సాగుతుంది. పిండి ఎంత మంచిగా కలుపుకుంటే బొబ్బట్లు అంత బాగా వస్తాయి. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండూ ఒకే దగ్గర పెట్టుకొని బొబ్బట్లు తయారు చేసుకోవాలి. పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని రోటీ టైప్ లో చేయాలి. తర్వాత అందులో శనగపప్పు మిశ్రమం చిన్న ముద్దలా చేసి మెల్లిగా తాల్చుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిపై నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే నోరూరించే తెలుగింటి వంటకం ఉగాది స్పెషల్ బొబ్బట్లు రెడీ అవుతాయి. ఇక ఇంటిల్లిపాది ఆనందంగా తినేయచ్చు. అయితే కొందరు భక్ష్యాలను చెక్కరతో చేసుకుంటారు. కానీ బెల్లంతో చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.






