- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోగ్యం కోసం ఆర్గానిక్ ఫుడ్.. ఆ ఇద్దరు యువకులు ఏం చేశారంటే..
ఆర్గానిక్ ఫార్మింగ్ కాన్సెప్ట్‌తో ఆ యువకుడు స్వయంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేశాడు. రైతు ఆన్‌లైన్ స్టోర్‌ను కూడా ప్రారంభించాడు.

దిశ, ఫీచర్స్ : మన తాతలు.. నాన్నమ్మలు ఏం తినేవాళ్లో గానీ.. నూరేళ్లు బతికేవాళ్లు. వృద్ధాప్యం మీదపడినా చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్లు. కానీ మనం..? ముప్పయ్యేళ్లకే కాళ్ల నొప్పులు.. కీళ్ల నొప్పులు.. బీపీ.. షుగర్‌లతో అవస్థలు పడుతున్న పరిస్థితి. అయితే ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే మార్పు సాధింవచ్చు అంటున్నారు ఇద్దరు వ్యాపార భాగస్వాములు.
హైదరాబాద్‌కు చెందిన ప్రతాప్ వర్మ.. రాజ్ వలివర్తి అనే ఇద్దరు యువకులకు ఆరోగ్య స్పృహ ఎక్కువ. ఇద్దరిదీ ఒకే ఆలోచన, ఒకే లక్ష్యం కావడంతో సరికొత్త ఆలోచనకు పుదను పెట్టారు. రసాయనాలు.. ప్రిజర్వేటివ్స్.. కృత్రిమ రంగులు లేని సహజ ఆహారాన్ని అందించాలనుకున్నారు వీళ్లు. 2025లో ‘ఫ్రిస్లీ’ అనే ఆర్గానిక్ ఫుడ్ బ్రాండ్‌ను స్టార్ట్ చేయడం ద్వారా బిజినెస్ పార్ట్‌నర్‌గా మారారు. ఇది డీటుసీ ప్లాట్‌ఫాం. అంటే డైరెక్ట్-టు-కన్జ్యూమర్ ప్లాట్‌ఫాం. దీని ద్వారా రసాయనాలు.. రంగులు లేకుండా రుచికరమైన.. నాణ్యమైన స్నాక్స్.. స్వీట్స్ వంటి 300కి పైగా ఉత్పత్తులను అందిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీళ్ల కస్టమర్లలో 60 శాతం మంది రిపీట్ కస్టమర్లే. అదే దీనికి కలిసొచ్చిన పాయింట్.
రైతు ఆన్‌లైన్ స్టోర్..
ఆహారం.. మెరుగైన ఆరోగ్య అధ్యయనంలో భాగంగా ప్రతాప్ వర్మ దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. పంజాబ్‌లో ‘క్యాన్సర్ ట్రైన్’ గురించి విని రైతులు సహజ ఆహారం తింటున్నప్పటికీ.. రసాయన ఎరువులు.. పురుగుమందుల వల్ల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని తెలుసుకున్నాడు. గతంలో ఉన్న ఆర్గానిక్ ఫార్మింగ్ కాన్సెప్ట్‌తో ప్రతాప్ స్వయంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేశాడు. సరైన ధర రాకపోవడం.. మార్కెట్ లేదని గ్రహించి ‘రైతు ఆన్‌లైన్ స్టోర్’.. ‘ఫార్మర్స్ బెస్ట్ సూపర్ మార్కెట్స్’ ప్రారంభించాడు. కానీ పిల్లల స్నాక్స్ లేవని కస్టమర్లు చెప్పడంతో మరో కొత్త ఆలోచన చేశాడు.
సాధ్యం కాదని చెప్పినా..
ప్యాకేజ్డ్ ఫుడ్‌లో రసాయనాలు లేకుండా రుచికరంగా తయారు చేయడం సులభం కాదు. చెఫ్‌లు.. ఫుడ్ టెక్నాలజిస్టులే ‘ఇది సాధ్యం కాదు’ అని చెప్పేశారు. కానీ ప్రతాప్.. రాజ్ వినలేదు. కొందరు చేతి నైపుణ్యం ఉన్న గృహిణులను తీసుకొచ్చారు. వారికి రసాయనాలు లేకుండా వండటం అలవాటు కదా.. దాదాపు 2-3 సంవత్సరాల రీసెర్చ్ చేశారు. అందులో చాలావరకు ఫెయిలయ్యాయి. ప్రయత్నిస్తూనే ఉంటే.. ఫైనల్‌గా 300కు పైగా ఉత్పత్తులు సిద్ధమయ్యాయి. అన్నీ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఉత్పత్తులే. ఎన్పీఓపీ.. హెచ్ఏసీసీపీ.. ఐఎస్ఓ.. జీఎంపీ.. జైవిక్ భారత్ సర్టిఫికేషన్లు పొందారు. ఇక శుభ్రత కోసం లెమన్ బేస్డ్ క్లీనింగ్ వాడుతున్నారు.
నమ్మకానికి నిదర్శనం..
మిల్లెట్ దోసె బ్యాటర్.. స్నాక్స్.. స్వీట్స్.. సవరీలు.. బేకరీ వంటి ఐటమ్స్ అన్నింటినీ రిఫైన్డ్ షుగర్.. మైదా.. ఆయిల్స్ లేకుండా చిన్న బ్యాచ్‌లలో మాత్రమే తయారు చేస్తారు. రుచి తగ్గకుండా.. ఆరోగ్యానికి హాని చేయకుండా బ్యాలెన్స్ ఫార్ములా అప్లయ్ చేస్తారు. వీళ్ల బిజినెస్ అంతా నోటిమాట ద్వారానే వృద్ధి చెందింది. 60% మంది కస్టమర్లు మళ్లీ మళ్లీ కొనుగోలు చేస్తున్నారంటే నమ్మకానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో థర్డ్-పార్టీ బ్రాండ్‌లను ఆన్‌బోర్డ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆర్గానిక్ రైతులకు మద్దతు.. వినియోగదారులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.






