- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health : బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా తీసుకుంటున్నారా..? ఆరోగ్యానికి మంచిదే!
బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా తీసుకోవడం వల్ల శరీరం గ్లూకోజ్‌కు బదులుగా కొవ్వును ఇంధనంగా ఉపయోగించుకునే ఫ్యాట్ బర్నింగ్ మోడ్లోకి మారుతుంది.

దిశ, ఫీచర్స్ : ఉదయం 9 గంటలలోపే బ్రేక్‌ఫాస్ట్ చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. అలా చేయడం మంచిదని కూడా అంటారు. ఎందుకంటే దీని వల్ల మధ్యాహ్నం లంచ్ చేసే వరకు రోజువారీ విధుల నిర్వహణలో శరీరానికి కావాల్సిన ఎనర్జీ వస్తుందని చెబుతుంటారు నిపుణులు. కానీ సెల్ మెటబాలిజం (Cell Metabolism)లో పబ్లిషైన ఒక అధ్యయనం మాత్రం బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా తినడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని తెలిపింది. ఆ వివరాలేమిటో చూద్దాం పదండి!
నిజానికి బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా తీసుకోవడం వల్ల రాత్రిపూట ఉపవాస సమయం పెరుగుతుంది. అంటే సాధారణంగా మనం నైట్ డిన్నర్ తర్వాత నుంచి మరుసటి రోజు బ్రేక్‌ఫాస్ట్ వరకు ఏమీ తినకుండా ఉంటాం. ఈ సమయం కాస్త పొడిగించడంవల్ల మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈ విధానం ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది కాబట్టి శరీరం గ్లూకోజ్‌కు బదులు కొవ్వును ఇంధనంగా ఉపయోగించుకునే ఫ్యాట్ బర్నింగ్ మోడ్లోకి మారుతుంది. అలాగే లివర్ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి కీటోన్ల(Ketones)ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి మెదడుకు ప్రత్యామ్నాయ ఇంధనంగా పనిచేసి, మెంటల్ క్లారిటీని, శరీరంలో ఎనర్జీని పెంచుతాయి. అంతేకాకుండా ఈ విధానం జీవక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
లేటుగా చేసే బ్రేక్‌ఫాస్ట్ వల్ల మరో బెనిఫిట్ ఏమిటంటే.. శరీరంలో ‘ఆటోఫాజీ’ అనే ప్రక్రియను ప్రేరేపిస్తుంది. ఇది కణాల్లోని దెబ్బతిన్న భాగాలను, ప్రోటీన్లను శుభ్రం చేసి, కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదే సమయంలో గ్రోత్ హార్మోన్ (GH) స్థాయిలు సహజంగా పెరుగుతాయి. ఇవి కండరాలను కాపాడుకోవడంలో, అధిక కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో మానసిక స్థితి కూడా మెరుగు పడుతుంది. అయితే ఆలస్యంగా బ్రేక్‌ఫాస్ట్ చేసే విధానం మంచిదే అయినప్పటికీ అందరికీ ఈ విధానం సరిపోలకపోవచ్చు. వారి వారి శరీర తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి నిపుణుల సహాలు పాటించాలి. బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా తీసుకోగలిగేవారు మొత్తం ఆహార నాణ్యత, పోషకాల సమతుల్యత, వ్యాయామం, నిద్ర వంటి సరైన జీవనశైలి పద్ధతులు కలితి ఉన్నప్పుడు మాత్రమే అది మేలు చేస్తుందని, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.






