రెండేండ్ల వ్యాయామంతో 20 ఏండ్లు పెరుగుతున్న గుండె ఆయుష్షు.. నిపుణుల సూచనలివే..

by Javid Pasha |

రెండేండ్లపాటు రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌లను కలిగి ఉన్నవారి గుండె ఆయుష్షు 20 ఏండ్లు అధికంగా ఉంటుందని వెల్లడిస్తున్నాయి.

రెండేండ్ల వ్యాయామంతో 20 ఏండ్లు పెరుగుతున్న గుండె ఆయుష్షు.. నిపుణుల సూచనలివే..
X

దిశ, ఫీచర్స్ : వ్యాయామాలు ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ప్రత్యేక వ్యాయామాలు కూడా ఉంటాయి. అయితే అన్ని రకాల సాధారణ శారీరక వ్యాయామాలు లేదా శారీరక శ్రమ కలిగి ఉండేవారి గుండె, ఎటువంటి వ్యాయామాలు లేనివారికంటే ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటుందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా రెండేండ్లపాటు రెగ్యులర్ ఎక్సర్‌సైజ్‌లను కలిగి ఉన్నవారి గుండె ఆయుష్షు 20 ఏండ్లు అధికంగా ఉంటుందని వెల్లడిస్తున్నాయి. గతంలో ‘యూటీ సౌత్ వెస్టర్న్ మెడికల్ సెంటర్ అండ్ టెక్సాస్ హెల్త్ రిసోర్సెస్’ నిర్వహించిన అధ్యయనం కూడా వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచుతాయని తెలిపాయి.

అధ్యయనంలో భాగంగా 50 ఏండ్ల వయస్సు గల వ్యక్తులు రెండేండ్లపాటు నియమిత ఏరోబిక్ అండ్ ఇంటర్వల్ ట్రైనింగ్‌లో పాల్గొన్నప్పుడు, సదరు వ్యక్తుల గుండె కండరాలలో ఏజ్ రిలేటెడ్ క్షీణత తగ్గిందని, దీంతో గుండె ఆయుష్షు సాధారణంకంటే 20 ఏండ్లు పెరిగిందని పరిశోధకులు గుర్తించారు. ఈ ఫలితాలు గుండె సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో వ్యా్యామం లేదా శారీరక శ్రమ ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుండె కండరాల క్షీణతను తగ్గించడంలో, గుండెను ఎక్కువకాలం యవ్వనంగా ఉంచడంలో ఏరోబిక్స్ మాత్రమే కాకుండా వేగవంతమైన నడక, ఇంటర్వల్ సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ వంటివి కూడా కీలకంగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతన్నారు. అందుకే తరచుగా వ్యాయామాలు లేదా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొనాలని సూచిస్తున్నారు. Link

Next Story